పేదలకు ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ లెఫ్ట్ కెనాల్ చైర్మన్, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావులు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో పబ్లిక్ ఆవరణలో శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అందత్వ నివారణ సంస్థ, కోదాడ పబ్లిక్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటుచేసిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. పేదలకు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా వారు అభినందించారు. దృష్టిలోపం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 200 మందికి ఉచితంగా పరీక్షలు,స్కానింగ్ నిర్వహించి మందులు, కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆపరేషన్లు అవసరం ఉన్నవారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పట్టాభిరెడ్డి, కార్యదర్శి బొల్లు రాంబాబు, మాజీ అధ్యక్షులు మేకల వెంకట్రావు, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, శేఖర్,నాగేశ్వరరావు, కారుమంచి సత్యనారాయణ, రాబిన్, హరిబాబు, విద్యాసాగర్ రావు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…….

previous post