Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మేం చిన్నోలం కాదు కొట్లాడి తెలంగాణ తెచ్చినోల్లం.. కప్పర ప్రసాద్ రావు టీ జె యూ రాష్ట్ర అధ్యక్షులు.. 

తెలంగాణ జర్నలిస్టులు అంటే చిన్నోళ్ళు కాదని కొట్లాడి తెలంగాణ తెచ్చినోళ్ళని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు అన్నారు. జిల్లా అధ్యక్షులు దేవరంపల్లి అశోక్ అధ్యక్షుతన జరిగిన సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశంకు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసమే పేపర్లు ఛానల్ పెట్టి నేను తెలంగాణ వచ్చిన తర్వాత హరి కోసం పడుతున్నది తెలంగాణ తెచ్చినోళ్ళే అని అన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలతొ కలిసి ఉద్యమంలో పాల్గొన్న సంగతి గుర్తు చేశారు. బిజెపి టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ మందకృష్ణ మాదిగ గద్దర్ విమలక్క ప్రొఫెసర్ కోదండరాం ఇలా అందరితో కలిసి పని చేసిన సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో బహుజన బతుకమ్మ ప్రారంభించింది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అని గుర్తు చేశారు. పదేళ్ల తెలంగాణలో జర్నలిస్టులు ఎక్కువగా నష్టపోయారన్నారు కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 5000 కిలోమీటర్ల బస్సు యాత్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జర్నలిస్టు చేసిన యాత్రగా నిలిచిపోయిందని అందులోనే ధరణి సమస్యలు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల న్యాయం జరగాలని పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. న్యాయవాదుల జంట హత్య పై పోరాడమని జర్నలిస్టు సంఘాల పేరుతో సొంత లాభం కోసం పని చేసుకునే నాయకులం కాదన్నారు సమస్య వచ్చిన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ముందుండి పోరాటం చేస్తున్న సంగతి గుర్తు చేశారు తెలంగాణలో ఆంధ్ర పత్రికల పెత్తనం ఏందని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ పత్రికలకు సరైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు జర్నలిస్టులు గొంతమ్మ కోరికలు కోరడం లేదని ఇల్లు విద్యా వైద్యం అందిస్తే సరిపోతుందని అన్నారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర అధ్యక్షులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ డబ్ల్యూ జె జాతీయ ఉపాధ్యక్షులు పెద్దాపురం నరసింహ రాష్ట్ర కార్యదర్శులు కనకారెడ్డి, బాబురావు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, మెదక్ జిల్లా అధ్యక్షులు పి రామయ్య, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు దిలీప్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రసాద్, సంగారెడ్డి జిల్లా ప్రదాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపధ్యక్షులు కనకయ్య, మహిపాల్ రెడ్డి, కార్యదర్శి మలేష్, కార్యవర్గసభ్యులు గందమల స్వామి, రానోజ్ ప్రదీప్, ఎం. దశరథ్, మహేష్ గౌడ్, ఎం డి జావేద్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

Harish Hs

సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌

TNR NEWS

నారాయణగూడెం గ్రామంలో బడిబాట కార్యక్రమం

Harish Hs

మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసిన మైనార్టీ నాయకులు

TNR NEWS

లిఫ్ట్ ఇస్తే బైక్ ఎత్తుకెళ్లిన దొంగ

TNR NEWS

బహుదొడ్డి రామారావు జీవితం నేటి తరానికి ఆదర్శం- ములకలపల్లి రాములు

Harish Hs