నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
300 మంది కాలేజీ విద్యార్థులతో ర్యాలీగా వెళ్లి ధర్నా చేసిన తర్వాత ఆర్డీవో అశోక్ రెడ్డికి 8 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయాలన్నారు.