పిఠాపురం : దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భవ సభ ఈనెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో ఎస్బి వెంచర్స్ లో జరగనుంది. జనసేన పార్టీ నిర్వహణ కమిటీ ఇప్పటికే ఆవిర్భవ సభ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. దీనిలో భాగంగా పిఠాపురం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. పాదగయ క్షేత్రం నుంచి మొదలైన బైక్ ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్, రధాల పేట, ఉప్పాడ బస్టాండ్, కోటగుమ్మం సెంటర్, చర్చి సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, పశువుల సంత, రామా టాకీస్ సెంటర్, చెరుకుల కాలువ, ఉప్పాడ సెంటర్ మీదుగా చిత్రాడ సభా ప్రాంగణానికి ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ 14వ తేదీ జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భవసభను నియోజకవర్గం ప్రజలందరూ విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, చెల్లుబోయిన సతీష్, బొజ్జా లోవరాజు, కొత్తెం సుందర్, ఆకుల దుర్గ, పాతర్లగడ్డ అరుణశ్రీ, అధిక సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.