December 6, 2024
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

*పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

*• విశ్రాంతి అనేది లేకుండా ప్రజల రక్షణ కోసం నిత్యం కష్టపడే వాళ్లు పోలీసులు*

*• ఎపి పోలీస్ అంటే ఒక బ్రాండ్…నక్సలిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని, రౌడీయిజాన్ని అణిచివేసిన చరిత్ర ఉంది.*

*• మళ్లీ పోలీసు శాఖను బలోపేతం చేస్తాం….నాలుగు నెలల్లో రూ.100 కోట్లు ఇచ్చాం.*

*• రూ.12 కోట్లతో తన ఇంటికి కంచె వేసుకున్న గత సిఎం….ఫింగ‌ర్ ప్రింట్ ఐడెంటిఫికేష‌న్ కోసం రూ. 10 కోట్లు ఇవ్వలేదు.*

*• సర్వేరాళ్లకు రూ. 700 కోట్లు ఖర్చు చేసిన గత సిఎం… సీసీటీవీ కెమెరాల నిర్వహణకు కోసం రూ. 10 కోట్లు కూడా విడుదల చెయ్యలేదు*

*• గత ప్రభుత్వం పోలీసు శాఖలోనే రూ. 763 కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టింది.*

*• రానున్న రోజుల్లో 6100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం…సాకేంతికంగా సౌకర్యాలు కల్పిస్తాం*

 

*- పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం:-*

 

పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా సోమ‌వారం విజ‌య‌వాడ‌, ఇందిరాగాంధీ మున్సిప‌ల్ మైదానంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ పోలీస్ అమ‌ర‌వీరులకు ఘ‌న నివాళులు అర్పించారు. వారి కుటుంబాల‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు వదిలిన పోలీసుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ ఏటా అక్టోబ‌ర్ 21న పోలీస్ అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నామన్నారు. 1959, అక్టోబ‌ర్ 21వ తేదీన భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు ల‌ఢ‌క్ లోయ‌లో భార‌త‌దేశ పోలీస్ బృందంపై చైనా ఆక‌స్మిక దాడి చేసిందన్నారు. త‌క్కువ సిబ్బంది ఉన్నా.. ప్రాణాలు పోతాయ‌ని తెలిసినా లెక్క‌చేయ‌కుండా తిరుగుబాటు చేశారన్నారు. ఆ సంఘ‌ట‌న‌లో ప‌దిమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారన్నారు. అలాంటి త్యాగ‌వీరులను స్మ‌రించుకోవాల‌నే ఉద్దేశంతో ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకుంటున్నామన్నారు. మ‌న రాష్ట్రంలో చూస్తే విధి నిర్వ‌హ‌ణ‌లో సీనియ‌ర్ అధికారులు సైతం ప్రాణ‌త్యాగం చేశారన్నారు. ఐపీఎస్ అధికారులు కేఎస్ వ్యాస్‌, ప‌ర‌దేశి నాయుడు, ఉమేష్ చంద్ర వంటి వారు న్యాయం కోసం, ధ‌ర్మం కోసం, ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసి, ప్రాణ‌త్యాగం చేశారన్నారు. ఇలా అనేక మంది మ‌ర‌ణించారన్నారు. వారందరి ఆత్మ‌కు శాంతిక‌ల‌గాల‌ని భ‌గ‌వంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారి స్ఫూర్తి ప్ర‌తి పోలీస్‌లోనూ ఉందన్నారు. అమ‌ర‌వీరుల కుటుంబ స‌భ్యుల‌కు అండ‌గా నిలిచామన్నారు. వారి కుటుంబ స‌భ్యులు ఉన్న‌త స‌ర్వీసుల్లో ఉంటూ నేడు రాష్ట్ర ప్ర‌గ‌తికోసం ప‌నిచేసే ప‌రిస్థితికి వ‌చ్చారన్నారు.

 

పోలీస్ శాఖ అత్యంత కీలకం:

 

 అన్ని శాఖ‌ల కంటే పోలీస్ శాఖ అత్యంత కీల‌క‌మ‌ని.. స‌మాజ హితం కోసం చేసే కృషిలో పోలీసులు కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు. ప్ర‌జ‌ల ప్రాణాలు, ఆస్తుల‌ను కాపాడేందుకు రాత్రి, ప‌గ‌లూ అని లేకుండా క‌ష్ట‌ప‌డేది పోలీసులు అని అన్నారు. సంఘ విద్రోహ శ‌క్తులు అనేక రూపాల్లో స‌మాజానికి స‌వాళ్లు విసిరే సంద‌ర్భంలో వాటిని ఎదుర్కొంటూ ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టంలో పోలీసుల కృషి వెల‌క‌ట్ట‌లేనిదన్నారు. 24X7 గా పాటు ప‌నిచేస్తూ విధుల్లో ఉండే ప‌రిస్థితన్నారు. ఇటీవ‌ల విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టంలో విశేష కృషి చేసిన పోలీసుల‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలోని బ్ర‌హ్మోత్స‌వాలు, ఇంద్ర‌కీలాద్రిపై ద‌స‌రా ఉత్సవాలు స‌మ‌యంలో పోలీసులు బాగా ప‌నిచేశారన్నారు. శాంతి, భ‌ద్ర‌త‌ల‌ను కాపాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా ద‌ర్శ‌నం చేసుకునేలా కృషిచేశారన్నారు. 

 

శాంతి, భ‌ద్ర‌తలకు తొలి ప్రాధాన్యం:

 

 ఏపీ పోలీసులు స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో గానీ, ఇప్పుడుగానీ దేశంలో ఓ ప్ర‌త్యేక బ్రాండ్ ఉన్న పోలీసులుగా గుర్తింపు సాధించారన్నారు. న‌క్స‌లిజాన్ని, క‌మ్యూన‌ల్ హింస‌ను, ఫ్యాక్ష‌నిజాన్ని, రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణ‌చివేసిన ఘ‌న‌త ఏపీ పోలీసుల‌కే ద‌క్కిందన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జీరో క్రైమ్ ఉండాల, ఎవ‌రైనా నేరాలు చేయాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి రావాలని, దానికోసం స‌మ‌ర్థ‌వంత‌మైన, ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ‌కు శ్రీకారం చుట్టాలన్నారు. శాంతి, భ‌ద్ర‌తలు అనేవి ప్ర‌భుత్వానికి మొదటి ప్రాధాన్యమన్నారు. పోలీసు సంక్షేమం అనేది ఈ ప్ర‌భుత్వ బాధ్య‌త‌, పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట యంత్రాంగంగా త‌యారుచేయ‌డం మా క‌ర్త‌వ్యంగా భావిస్తున్నానన్నారు.

 

పోలీసు వ్య‌వ‌స్థ‌లో సంస్కరణలు తెచ్చాం:

 

 2014 త‌ర్వాత పోలీసు వ్య‌వ‌స్థ‌లో అనేక మార్పులు తీసుకొచ్చామని, అవ‌స‌రం మేర‌కు వాహ‌నాలు, ప‌రిక‌రాలు, సాంకేతిక సౌక‌ర్యాల‌ను అందుబాటులో ఉంచామన్నారు. ఏపీ పోలీస్ అంటే దేశంలోనే మోడ‌ల్ పోలీస్ గా ఉండాల‌నే ఉద్దేశంతో వివిధ చ‌ర్య‌లు తీసుకున్నామన్నారు. 2014-19లో రూ. 600 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు. కొత్త‌గా వాహ‌నాల‌కు రూ. 150 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు. పోలీస్ స్టేష‌న్లు, నివాస క్వార్ట‌ర్స్‌లో మౌలిక స‌దుపాయాలు కోసం, మంగ‌ళ‌గిరి పోలీస్ హెడ్ క్వార్ట‌ర్స్‌, టెక్ ట‌వ‌ర్ నిర్మాణం కోసం రూ. 170 కోట్లు ఖ‌ర్చుచేశామన్నారు. పోలీసుకార్యాల‌యాల మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం రూ. 60 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు. అధునాత‌న టెక్నాల‌జీ రావాల‌నే ఉద్దేశంతో రూ. 27 కోట్లు ఖ‌ర్చుచేసి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎక్విప్‌మెంట్‌ను కొనుగోలు చేశామన్నారు. దేశంలోనే అత్యాధునిక ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌ను స‌మైక్యాంధ్రాలో ఆనాటి ముఖ్య‌మంత్రిగా హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేశామన్నారు. క‌మ్యూనికేష‌న్ సిస్ట‌మ్, డేటా సెంట‌ర్ కోసం రూ. 25 కోట్లు, ఆయుధాలు, మొబిలిటీ, ఇత‌ర నిర్మాణాల కోసం రాష్ట్ర వాటా కింద రూ. 80 కోట్లు, పోలీసు సంక్షేమం కోసం అయిదేళ్ల‌లో రూ. 55 కోట్లు, ఈ-ఆఫీస్ కోసం రూ. 20 కోట్లు ఖ‌ర్చు చేశామన్నారు. ఇలా 617 ప‌నుల‌కు రూ. 320 కోట్లు ఖ‌ర్చు చేసి ముందుకెళ్లుతున్నామన్నారు. పోలీసు శాఖ‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించాల‌ని, ఎక్క‌డిక‌క్క‌డ స‌వాళ్ల‌ను దీటుగా ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. విశాఖ‌ప‌ట్నంలో దీనికోసం ప్ర‌త్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశామన్నారు. కేంద్రం రూ. 219 కోట్లు ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డితే గ‌త ప్ర‌భుత్వం అది కూడా తీసుకోలేక‌పోయారన్నారు. కొత్త‌గా ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఏర్పాటుచేయ‌డం, రీజ‌న‌ల్ ల్యాబ్స్ ఏర్పాటుచేయ‌డానికి కేంద్రం రూ. 152 కోట్లు మంజూరుచేస్తే అదికూడా తీసుకోలేక‌పోయారన్నారు. పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు, ఆధునికీక‌రించేందుకు కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు ముందుకొస్తోందన్నారు. పోలీసుల‌పై పెట్టే పెట్టుబ‌డి.. రాష్ట్ర అభివృద్ధికి పెట్టే పెట్టుబ‌డిగా భావించి రాష్ట్ర ప్ర‌భుత్వాలు అందుకు కృషిచేస్తున్నాయన్నారు. 

 

సాంకేతికతను ఎప్పడికప్పుడు అందిస్తున్నాం..

 

నేను ముఖ్య‌మంత్రిగా తొలిసారి బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఎప్పుడూ పోలీసు వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పెట్టామన్నారు. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని పోలీసు శాఖ‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అందించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌కుందన్నారు. మ‌న‌వ‌ద్ద అధునాత‌న ఎక్విప్‌మెంట్ లేకుంటే నేర‌స్థుల‌తో పోరాడ‌లేమని, పోలీసు వ్య‌వ‌స్థ‌పై ప్ర‌త్యేక దృష్టిపెడ‌తామని, ఆధునిక ప‌రిక‌రాలు తెప్పిస్తామన్నారు.. రూ. 100 కోట్ల పైబ‌డిన బిల్లులుంటే వాట‌న్నింటినీ ప‌రిష్క‌రించామన్నారు. దిశ చ‌ట్టం లేదుగానీ.. దిశ పేరుతో వాహ‌నాల‌కు రూ. 16 కోట్ల బిల్లు పెండింగ్ పెడితే అవి కూడా చెల్లించామన్నారు. క‌మ్యూనికేష‌న్ ప‌రిక‌రాలు, నిర్మాణాలు, సైబ‌ర్ ల్యాబ్ కోసం గ‌త ప్ర‌భుత్వం రూ. 20 కోట్లు పెండింగ్ పెడితే వాటిని క్లియ‌ర్ చేశామన్నారు. కేంద్ర‌మిచ్చే నిధుల్లో రాష్ట్ర వాటా కింద 2021-22 వ‌ర‌కు ఇవ్వాల్సిన రూ. 61 కోట్లు పెండింగ్ పెడితే వాటిని క్లియ‌ర్ చేశామన్నారు. ఎవ‌రైనా త‌ప్పుచేస్తే వెంట‌నే వారిని ప‌ట్టుకునే వ్య‌వ‌స్థ మ‌న‌ద‌గ్గ‌ర ఉంటే ఎవ‌రైనా భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉంటుందన్నారు.

 

గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో క‌క్ష‌సాధింపు, రాజ‌కీయ వేధింపుల కోసం పోలీసుల‌ను త‌యారుచేసే ప‌రిస్థితికి వ‌చ్చారన్నారు. అలాంటి ప‌నుల‌కు ప్ర‌తిష్టాత్మ‌క ఐపీఎస్ వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించారన్నారు. పోలీసులంటే రాగ‌ద్వేషాల‌కు అతీతంగా ప‌నిచేసే వ్య‌వ‌స్జ‌, నేర‌స్థులు ఏ రూపంలో వ‌చ్చినా ప‌సిగ‌ట్టి స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనే వ్య‌వ‌స్థ‌ అని అన్నారు. ఆనాటి ముఖ్య‌మంత్రి ర‌క్ష‌ణ కోసం రూ. 12 కోట్లతో కంచె వేసుకొనన్నారన్నారు. ఫింగ‌ర్ ప్రింటింగ్ ఐడెంటిఫికేష‌న్ వంటి వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ కోసం అయిదేళ్ల‌లో రూ. 10 కోట్లు ఇవ్వ‌లేక‌పోయారన్నారు. మ‌రోవైపు స‌ర్వే రాళ్ల‌పైన రూ. 700 కోట్లు త‌గ‌లేసిన వ్య‌క్తి సీసీటీవీ కెమెరాల కోసం రూ. 700 కోట్లు ఇవ్వ‌లేక‌పోయారన్నారు. ఈ మొత్తం ఇచ్చుంటే ఈరోజు అఘాయిత్యాలు జ‌రిగే ప‌రిస్థితి ఉండేది కాదన్నారు. విశాఖ‌లో రూ. 500 కోట్ల‌తో ప్యాలెస్ క‌ట్టుకున్న వ్య‌క్తి పోలీసుల‌కు స‌రెండ‌ర్ లీవ్‌లు ఇవ్వ‌క‌పోవ‌డం చాలా బాధాక‌రన్నారు. నాకు కూడా పెను స‌వాళ్లు ఉన్నాయని, రూ. 10,50,000 కోట్లు గ‌త ప్ర‌భుత్వం వార‌స‌త్వంగా తీసుకున్న అప్పుల‌న్నీంటికీ వ‌డ్డీ చెల్లించాలన్నారు. అప్పులు చెల్లించాల్సి ఉంది, ఇదే స‌మ‌యంలో మీ సంక్షేమానికి ప‌నిచేయాల్సిన అవ‌స‌ర‌ముందన్నారు.

 

రాజ‌కీయాల ముసుగులో నేరాల‌కు పాల్ప‌డే వారిపై కఠిన చర్యలు:

 

నేడు పోలీసు శాఖ‌లో అనేక స‌వాళ్లు ఉన్నాయి, సైబ‌ర్ నేరాలూ పెరుగుతున్నాయన్నారు. నేర‌గాళ్ల కంటే మెరుగ్గా మ‌నం టెక్నాల‌జీని అప్‌డేట్ చేసుకుంటే శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌గ‌లమన్నారు. మ‌న‌ది పైచేయి అయిన‌ప్పుడే నేర‌గాళ్ల‌ను క‌ట్ట‌డిచేయ‌గ‌లుగుతామన్నారు. కొంద‌రు రాజ‌కీయ ముసుగులో నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. పోలీసు వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారన్నారు. ఆ ముసుగు తీసి శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడే విష‌యంలో పోలీసుల‌కు అండ‌గా ఉండే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిద‌ని తెలియ‌జేస్తున్నామన్నారు. 1995 నుంచి టెక్నాల‌జీని ప్ర‌మోట్ చేస్తున్నామన్నారు. బాడీ వార్న్ కెమెరాలు తీసుకొచ్చామన్నారు. సెంట్ర‌ల్ కంట్రోల్ రూమ్ నుంచి ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించే వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చామన్నారు. డ్రోన్స్‌, సీసీటీవీ, సెల్‌ఫోన్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోగ‌లిగితే, రియ‌ల్‌టైమ్ ప‌రిస్థితిని మానిట‌రింగ్ చేయ‌గ‌లిగితే నేర‌స్తులు ద‌గ్గ‌ర‌కొచ్చేందుకు భ‌య‌ప‌డ‌తారన్నారు. మూడో నేత్రం మ‌న పోలీసు వ్య‌వ‌స్థ అన్నారు. ఇప్పుడు మూడో నేత్రానికి స‌హ‌క‌రించే వ్య‌వ‌స్థ టెక్నాల‌జీ అని తెలియ‌జేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్ర‌తి సెన్సిటివ్ ప్రాంతంలో సీసీటీవీ కెమెరా ఉంటుందన్నారు. నేరుగా కంట్రోల్ రూమ్‌కు అనుసంధాన‌మ‌వుతుందన్నారు. అన‌లిటిక్స్ , డేటాను మానిట‌ర్ చేయ‌డం జ‌రుగుతుందన్నారు. ఎవ‌రైనా రౌడీయిజం చేయాల‌ని చూస్తే అదే వారికి చివ‌రిరోజు కావాల‌నేది నా ఆకాంక్ష‌, ఆ విధంగా మా పోలీసు వ్య‌వ‌స్థ‌ను త‌యారుచేస్తామన్నారు. నేర‌గాళ్ల‌కు శిక్ష‌ప‌డేలా చేస్తామన్నారు. కొంద‌రు రాక్ష‌సులు మాదిరి ఆడ‌బిడ్డ‌ల‌పై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నారన్నారు. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతున్నారన్నారు. ఆడ‌బిడ్డ‌ల‌కు ఒకటే విజ్ఞ‌ప్తి చేస్తున్నా, మోస‌గాళ్ల ట్రాప్‌లో ప‌డొద్ద‌ని కోరుతున్నానన్నారు. ప్ర‌తికేసునూ ఒక స‌వాలుగా తీసుకొని ఛేదిస్తామన్నారు. చ‌ట్ట‌ప‌రంగా శాశ్వ‌త ప‌రిష్కారాన్ని చూపుతామన్నారు. హిందూపురం, బ‌ద్వేల్‌, బాప‌ట్ల ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి మూడు కేసుల‌నూ ప్ర‌త్యేక కోర్టుకు అప్ప‌గిస్తున్నామన్నారు. త‌ద్వారా త‌ప్పుచేసిన వారికి శిక్ష ప‌డుతుందన్నారు. నేర‌గాళ్ల‌కు గుణ‌పాఠం త‌ప్ప‌దన్నారు. పోలీసు శాఖ‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దు అని నేర‌గాళ్ల‌ను ప‌క‌డ్బందీగా క‌ట్ట‌డి చేస్తామన్నారు.

 

గ‌త ప్ర‌భుత్వం రూ. 763 కోట్లు మేర పోలీసుల‌కు స‌రెండ‌ర్ లీవ్‌లు, జీపీఎఫ్‌, టీఏ బిల్లులు.. ఇలా అన్నింటినీ పెండింగ్‌లో పెట్టారు. నేను హామీ ఇస్తున్నామన్నారు. అంచెల‌వారీగా అంద‌రికంటే ముందుగా పోలీసు శాఖ‌కు స‌హ‌క‌రించేవిధంగా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. వాట‌న్నింటినీ క్లియ‌ర్ చేస్తామ‌ని తెలియ‌జేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో 6,100 మంది పోలీస్ కానిస్టేబుళ్ల‌ను నియ‌మించే బాధ్య‌త‌ను ఈ ప్ర‌భుత్వం తీసుకుంటుందన్నారు. ఈ సంవ‌త్స‌రం నుంచి పోలీసు సంక్షేమం కోసం క‌నీసం రూ. 20 కోట్లు ఇస్తామన్నారు. పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం కోసం అమ‌రావ‌తిలో ఒక ప్ర‌త్యేక ప్రాంతాన్ని ఏర్పాటుచేసుకుందామన్నారు. వ‌చ్చే ఏడాది నుంచి అక్క‌డే దినోత్స‌వాన్ని జ‌రుపుకుందామన్నారు. 2047 నాటికి భార‌తదేశం ప్ర‌పంచంలో ఒక అగ్ర‌దేశంగా త‌యార‌వుతుందన్నారు. మ‌న రాష్ట్రాన్ని కూడా తీర్చిదిద్దే బాధ్య‌త మ‌న పోలీసు వ్య‌వ‌స్థ‌పై ఉందన్నారు. అందుకు అంద‌రూ సిద్ధంగా ఉండాలన్నారు. మ‌రోసారి పోలీసు అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళులు అర్పించిన అనంత‌రం గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్ర‌సంగాన్ని ముగించారు.

 

హోమ్ శాఖ మంత్రి శ్రీమతి అనిత మాట్లాడుతూ దేశ భద్రత కోసం ప్రాణాలను అర్పించిన పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్‌ 21వ తేదీని పోలీస్‌ సంస్మరణ దినంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సంస్మరణ దినాన్ని ‘పోలీస్‌ ఫ్లాగ్‌ డే’ గా అక్టోబర్‌ 21 వతేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించాలని భారత ప్రభుత్వం గతేడాది ఒక సముచిత నిర్ణయం తీసుకుని అమలు చేస్తోందన్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల ధన, మాన, ప్రాణాలను రక్షించడమే విధిగా, కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలను త్యాగం చేసి అమరులైన పోలీసు వీరులందరికీ ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. అసాంఘిక శక్తులని ఎదిరించి వీరమరణం పొందిన శ్రీ కె.ఎస్.వ్యాస్ ఐపీఎస్, ఉమేష్ చంద్ర, ఐపీఎస్, పరదేశి నాయుడు మరియు నక్సల్స్ తో పోరాటం చేస్తూ మరణించిన ఆర్.ఐ ప్రసాద్ బాబు వారిలో మచ్చుకకు కొందరు మాత్రమే అని తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందన్నారు. విజయవాడ వరదల సమయంలో సాయం అందిస్తూనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, దసరా శరన్నవరాత్రులు, విజయనగరం సిరిమానోత్సవం వంటి కార్యక్రమాల్లో గట్టి బందోబస్తు నిర్వహించి ఎక్కడా చిన్న ఇబ్బంది కలగకుండా చేయగలిగామన్నారు.. 1959 అక్టోబర్‌ 21న భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో డీఎస్పీ కరణ్‌సింగ్‌ నేతృత్వంలో 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుండగా, చైనా రక్షణ బలగాలు మన భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పిఎఫ్‌ దళం వారిని ధీటుగా ఎదురొడ్డి పోరాడిందన్నారు. ఆ పోరాటంలో పది మంది భారతీయ జవాన్లు ప్రాణాలను కోల్పోయారన్నారు. ఆ త్యాగానికి గుర్తుగా ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల్లో పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ అన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు స్టేట్ టాస్క్ ఫోర్స్ ని ప్రత్యేకంగా రూపొందించాం. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా యువత డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా అవగాహన కల్పిస్తుమన్నారు.

 

రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ అక్టోబర్ 21 అత్యంత ప్రాముఖ్యత కలిగిన త్యాగాల దినం.. భారత పోలీసుల త్యాగ నిరతిని ప్రపంచానికి చాటి చెప్పిన రోజు అక్టోబర్ 21 అని అన్నారు.. 1959 అక్టోబర్‌ 21న భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో డీఎస్పీ కరణ్‌సింగ్‌ నేతృత్వంలో కొద్దిమంది సీఆర్పిఎఫ్‌ దళం సభ్యుల బృందం వీరోచితంగా నిరోదించే ప్రయత్నంలో అంతిమంగా తమ ప్రాణాలను సైతం బలిపెట్టారన్నారు.. చివరి రక్తపు బొట్టు వరకు శత్రువులను అడ్డుకుంటూ పోరాడారే తప్ప వారికి వెన్ను చూపి పారిపోలేదన్నారు… ధీరత్వం ప్రదర్శించి వీర స్వర్గాన్ని అలంకరించారన్నారు.. ఆనాటి నుంచి అక్టోబర్‌ 21 నాడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటూ ఆ మహనీయుల మహోన్నత త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నామన్నారు. వారి వీర మరణాలతో స్ఫూర్తిని, ప్రేరణలను పొందుతున్నామన్నారు పోలీసు ఉద్యోగం అంటే రోజులో కొన్ని గంటలే నిర్వహించటం కాదు.. జీవితాన్నే సమాజానికి అంకితం చేయడం అన్నారు.. అనుక్షణం వెంటాడే ఆపదను గమనిస్తూ అడుగడుగునా వెంటాడే ప్రమాదాలను గమనిస్తూ ఇలా మొత్తంగా సవాళ్లతోనే సహజీవనం చేసేదే ఈ పోలీసు ఉద్యోగం అని అన్నారు.. సమాజంలో శాంతి, భద్రతలు కాపాడటమే పోలీసు ప్రధమ కర్తవ్యం అని అన్నారు… పోలీసు ఉద్యోగ బాధ్యతలు కాపాడాలంటే ఎంతో తెగువ, ధృడ సంకల్పం కలిగి ఉండాలన్నారు.. కుటుంబ సంక్షేమం కంటే సమాజ రక్షణ కే కట్టుబడి ఉండాలన్నారు.. సమాజ శాంతి, సుస్తిరతే మన విధి నిర్వహణకు ప్రతీకలు కావాలి అని అన్నారు.. సామాన్య ప్రజల సంతోషమే మన మానసిక వేదికలవ్వాలి.. పోలీసుల త్యాగాలు, వారి ఆశయాలు వృధా పోనీయకుండా ఆ బాధ్యతను ముందుకు తీసుకువెళ్లే గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలచి భరోసా అందిస్తున్నారన్నారు.

 

పోలీసు సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ఐజీ ఇంటెలిజెన్స్ సీహెచ్. శ్రీకాంత్, పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, పోలీసు అమరవీరుల కుటుంబాలు, తదితరలు పాల్గొన్నారు..

Related posts

శ్రీకాళహస్తి: స్వామివారి సేవలో సినీనటులు జీవిత రాజశేఖర్

TNR NEWS

ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు – ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం..!!

TNR NEWS

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

TNR NEWS

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నైపుణ్య‌శిక్ష‌ణ ల‌క్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు*

TNR NEWS

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన 2024-25 బడ్జెట్‌ సమావేశాలు..!

TNR NEWS

విధుశేఖర భారతీ స్వామీజీని కలిసిన జగన్

TNR NEWS