Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేంద్రీయ రంగులతో హోలీ సంబరాలు. 

ఈ సందర్భంగా ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ కుమార్ మాట్లాడుతూ హోలీ అనేది హిరణ్యకశ్యపుడు పై నరసింహుడి విజయం ద్వారా చెడుపై మంచి యొక్క విజయాన్ని సూచిస్తుందని, హోలీ అనేది వసంతపు రాకను, హరినామ స్మరణను సూచిస్తుందని మరియు హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకోవడం వల్ల స్నేహ బంధాలు, ప్రేమ సౌభాగ్యాలు వెలువరిస్తాయని మన పురాణాలు చెప్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఐఎంఏ జగిత్యాల భవన్లో జరిగిన హోలీ సంబరాల్లో పర్యావరణానికి మరియు చర్మానికి హాని కలిగించే రసాయన రంగులకు బదులు సహజమైన మరియు సురక్షితమైన సేంద్రీయ రంగులతో డాక్టర్లందరు ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన వాతావరణంలో హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో ఐఎంఏ జగిత్యాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్ , డాక్టర్ ముస్కు జయపాల్ రెడ్డి , డాక్టర్ సిహెచ్ పద్మిని , డాక్టర్ గూడూరి శ్రీలత గారు, డాక్టర్ వొడ్నాల రజిత, తదితరులు పాల్గొన్నారు

Related posts

కేజీబీవీ పాఠశాల తనిఖీ చేసిన ఎంపీడీవో సత్తయ్య

TNR NEWS

ఉపాధి హామీ పథకంలో రేషన్ డీలర్లకు పని కల్పించాలి

TNR NEWS

ఆ సర్వీసు రోడ్లపై పేరుకుపోయిన మట్టిని తొలగించాలి : సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు

TNR NEWS

బడి బోరా….?..మడి బోరా…..!?

TNR NEWS

సూర్యాపేట జిల్లాలో ముగిసిన ఆపరేషన్ స్మైల్

Harish Hs

ఎంపిడివో కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇంన్చార్జ్ సీఈవో …బాల్దూరి శ్రీనివాస రావు

TNR NEWS