ఈ సందర్భంగా ఐఎంఏ జగిత్యాల అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ కుమార్ మాట్లాడుతూ హోలీ అనేది హిరణ్యకశ్యపుడు పై నరసింహుడి విజయం ద్వారా చెడుపై మంచి యొక్క విజయాన్ని సూచిస్తుందని, హోలీ అనేది వసంతపు రాకను, హరినామ స్మరణను సూచిస్తుందని మరియు హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకోవడం వల్ల స్నేహ బంధాలు, ప్రేమ సౌభాగ్యాలు వెలువరిస్తాయని మన పురాణాలు చెప్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఐఎంఏ జగిత్యాల భవన్లో జరిగిన హోలీ సంబరాల్లో పర్యావరణానికి మరియు చర్మానికి హాని కలిగించే రసాయన రంగులకు బదులు సహజమైన మరియు సురక్షితమైన సేంద్రీయ రంగులతో డాక్టర్లందరు ఆహ్లాదకరమైన మరియు సంతోషకరమైన వాతావరణంలో హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో ఐఎంఏ జగిత్యాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్ , డాక్టర్ ముస్కు జయపాల్ రెడ్డి , డాక్టర్ సిహెచ్ పద్మిని , డాక్టర్ గూడూరి శ్రీలత గారు, డాక్టర్ వొడ్నాల రజిత, తదితరులు పాల్గొన్నారు

previous post