Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రవ్యాప్తంగా ఫామ్ పాండ్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

  • ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల సేద్యపు నీటి కుంటల నిర్మాణం

 

  • కర్నూలు జిల్లా పూడిచర్లలో శంకుస్థాపన

 

కర్నూలు : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పొలాల్లో సేద్యపు నీటి కుంటల(ఫామ్ పాండ్స్) నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.930 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 1.55 లక్షల ఫామ్ పాండ్స్ కు శంకుస్థాపన చేశారు. పూడిచర్లలో రైతు సూర రాజన్నకు చెందిన 1.30 ఎకరాల వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేయనున్న సేద్యపు కుంటకు భూమి పూజ చేశారు. ఉపాధి కూలీలతో కలసి స్వయంగా గడ్డపార పట్టి గుంత తవ్వి సేద్యపు గుంత పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యురాలు భైరెడ్డి శబరి, పాణ్యం శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు శాసన సభ్యులు గిత్తా జయసూర్య, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కృష్ణ తేజ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

TNR NEWS

చిల్డ్రన్ మరియు యూత్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్

Dr Suneelkumar Yandra

నిరుపేద కుటుంబాలకు అండగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

ఏపీ అసెంబ్లీలో ప్రారంభమైన 2024-25 బడ్జెట్‌ సమావేశాలు..!

TNR NEWS

పిఠాపురంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకుపైగా కేటాయింపు

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS