- సీసీ రోడ్ల కోసం రూ. 22 కోట్లు, బీటీ రోడ్ల కోసం రూ. 10.85 కోట్లు
- ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతుల కోసం రూ. 8 కోట్లు
- ఇప్పటికే 16 కోట్ల రూపాయల ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం, మరమ్మత్తులు చేపట్టాం
- మీడియా సమావేశంలో శాసన మండలి సభ్యుడు నాగబాబు
పిఠాపురం : జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ శాసన సభ్యులుగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.40 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు శాసన మండలి సభ్యుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో పలు నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభించిన నాగబాబు శనివారం చేబ్రోలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీసీ రోడ్ల కోసం రూ.22 కోట్లు, బీటీ రోడ్ల కోసం రూ.10.85 కోట్లు కేటాయించగా ఇప్పటికే 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. ఇవి కాకుండా ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మతుల కోసం మరో రూ. 8 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
- పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ప్రారంభించిన రోడ్ల వివరాలు..
పిఠాపురం నియోజకవర్గంలో రూ. 3.70 కోట్ల ఖర్చుతో నిర్మించిన బీటీ, సీసీ రోడ్లను శనివారం ప్రారంభించగా అందులో పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో రూ. 15.70 లక్షల వ్యయంతో మూడు సీసీ రోడ్లు, విరవ గ్రామంలో రూ.75 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు, గోకివాడ గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో రూ.29.65 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, చిన్న జగ్గంపేట గ్రామంలో రూ.28.95 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, యు.కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో రూ.38 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, కొత్తపల్లి గ్రామంలో రూ.11 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, ఉప్పాడ కాలనీ రోడ్లపై 14 పనులకు గానూ రూ.1.52 కోట్ల వ్యయంతో, మొత్తం రూ.3.70 కోట్ల రూపాయలు ఖర్చుతో రోడ్లను నిర్మించడం జరిగిందని అన్నారు.
- రికార్డు స్థాయిలో సామాజిక పెన్షన్ల పంపిణీ
కొణిదల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పిఠాపురం నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రికార్డు స్థాయిలో 39.441 మందికి సామాజిక పెన్షన్లు ప్రతీ నెల రూ.16.81 కోట్లు అందించడం జరుగుతోందని కొణిదల నాగబాబు స్పష్టం చేశారు. దీపం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 70,328 మందికి దాదాపుగా రూ.5.84 కోట్ల వ్యయంతో గ్యాస్ సిలిండర్ లు అందజేయడం జరుగుతోందని అన్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం ప్రాంతంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.59.70 కోట్లు మంజూరు చేసి, పాలనాపరమైన అనుమతి లభించడం ఆనందదాయకమని చెప్పారు. సామర్లకోట – ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలు సులువు అయ్యి ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని స్పష్టం చేశారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
- గొల్లప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో రూ.88.98 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభించినట్లు నాగబాబు తెలిపారు. ఈ ఆసుపత్రిలో సుమారు 23,146 మంది ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందుతాయని, 10 పడకల్ సామర్థ్యంతో, 60 రకాల ల్యాబ్ పరీక్షలు, 172 రకాల మందులు, టిబి, కుష్టు, ఎయిడ్స్ నియంత్రణ, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ ఇక్కడ నిరంతరం జరుగుతుందని వెల్లడించారు.
- గొల్లప్రోలులో తహసీల్దార్ కార్యాలయం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రూ.60 లక్షల వ్యయంతో తహసిల్దార్ కార్యాలయం కోసం ఆధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించినట్లు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలోనే ఉండడం వలన ప్రజా సేవల పరిధి మెరుగుపడి, ప్రజా వినతి దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని అన్నారు.
- గొల్లప్రోలు నగర పంచాయితీ – తాగు నీటి సరఫరా అభివృద్ధి
గొల్లప్రోలు పట్టణంలోని 20 వార్డుల తాగు నీటి సమస్య పరిష్కారం కోసం రూ.65.24 లక్షలు మంజూరయ్యాయని, ఈ నిధుల ద్వారా తాటిపర్తి బోర్లకు 2 సబ్ మెర్సిబుల్ 20 హెచ్ పి మోటార్లు మార్చడం, ఒక కొత్త బోర్ ఏర్పాటు, 200 ఎం ఎం డయా హెచ్.డి.పి.ఈ. పైపు లైన్ – 600 మీటర్లు, 110 ఎం ఎం పైపు లైన్ – 466 మీటర్లు కొత్తగా వేయడం, లీకేజీలు రిపేర్ చేయడం, 12 పాత వాల్వులను కొత్త వాటితో మార్చడం, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటులో పంపు సీట్లు మరియు ఫిల్టర్ మీడియా ఛాంబర్లు కొత్తగా ఏర్పాటు చేయడం, ప్లాంటు భవనానికి పెయింటింగ్ పనులు పూర్తి చేయడం వంటివి జరిగాయని తెలిపారు. ఈ అభివృద్ధి పనుల కారణంగా 23,880 మంది ప్రజలకు రోజు వారి తాగు నీటి సరఫరా మెరుగుపడిందని, గతంతో పోలిస్తే ప్రస్తుతం నీటి సరఫరా మరింత సమర్థంగా నిర్వహిస్తోందని తెలిపారు.
- గొల్లప్రోలు నగర పంచాయతీలో అన్న క్యాంటీన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో రూ.17 లక్షల వ్యయంతో, 2339 చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్న క్యాంటీన్ నిర్మించిందని, ప్రజల సౌకర్యార్థం 8 ఫ్యాన్లు, 6 టేబుల్స్, 15 కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు తాగు నీటి కోసం ఆర్ వో ప్లాంట్ ఏర్పాటు చేశామని, ఈ క్యాంటీన్ నిర్వహణ కోసం 9 మంది సిబ్బందిని నియమించినట్లు, ఇక్కడ రోజుకు మూడు పూటలా తక్కువ ధరకు భోజనం అందుబాటులో ఉంటుందని, ఉదయం 250 మందికి అల్పాహారం, మధ్యాహ్నం 300 మందికి భోజనం, రాత్రి 200 మందికి భోజనం కేవలం 5 రూపాయలకే అందిస్తారని, అవసరాన్ని బట్టి భోజనాల సంఖ్య పెంచే వీలు కూడా ఉందని అన్నారు. అన్న క్యాంటీన్ లో భోజనం వేడిగా, శుచిగా, శుభ్రంగా అందించబడుతుందని, భోజన నాణ్యత, పరిశుభ్రత గురించి ప్రజలు తమ అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ లేదా ఐ వీ ఆర్ ఎస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చని, ఈ క్యాంటీన్ ప్రాంగణాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రతి రోజూ పరిశీలిస్తారని అన్నారు.
- సామాజిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహం
పిఠాపురంలో రూ.1.68 కోట్ల వ్యయంతో నిర్మితమైన సమీకృత బాలికల వసతి గృహానికి సామాజిక సంక్షేమ శాఖ రూ.13.50 లక్షలు మంజూరు చేయగా ఆంధ్రప్రదేశ్ విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా మరమ్మతులు పూర్తి చేశామని, ఈ పనుల్లో ఫ్లోరింగ్ పునర్నిర్మాణం, టాయిలెట్ల అప్ గ్రేడ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ మరమ్మతులు, తలుపులు, కిటికీలు, స్లాబ్ లీకేజీ పరిష్కారం, ప్రహారీ గోడ నిర్మాణం, భవనానికి పెయింటింగ్ మరియు వాకింగ్ టైల్స్ వేసి వసతి గృహాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చామని, రూ. 36.50 లక్షల విలువైన ఈ విలువైన అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.
- రథాలపేట పొజిషన్ పట్టాలు
16వ వార్డు రథాలపేట నివాసితులు 20 ఏళ్లుగా ప్రభుత్వ భూమిలో నివసిస్తూ పొజిషన్ పట్టాలు కోరగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు పరిశీలన చేపట్టి 15 అర్హులైన కుటుంబాలకు పొజిషన్ పట్టాల తయారీ పూర్తి చేయడం జరిగిందని, అర్హులైన వారికి ఆ పట్టాలు కూడా అందజేయడం జరిగిందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పి.గన్నవరం శాసన సభ్యుడు గిడ్డి సత్యనారాయణ, టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, పిఠాపురం ఇన్‌చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), భీమిలి ఇంచార్జ్ పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు.