Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ప్రత్యేక కథనం

నాటి జ్ఞాపకాలు..

ఈయనే నాటి బాలచంద్రుడు మంత్రి దుర్గేష్

 

అమరావతిలో జరిగిన సాంస్కృతి కార్యక్రమంలో బాలచంద్రుడిగా యావత్తు తెలుగు ప్రజలను అలరించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చదువుకునే రోజుల్లో బాలచంద్రుడు వేషధారణ ఫోటో ఇది. బాల్యం నుంచి ఆయన చదువుతోపాటు సాంస్కృతిక క్రీడారంగంలో ప్రతిభాశాలి. అచ్చ తెలుగులో అనర్గంగా మాట్లాడే వాక్చాతుర్యం ఆయన సొంతం.

తాతల కాలం నుంచి రాజకీయ కుటుంబం అయినప్పటికీ ఈయన ఎక్కడ హద్దు మీరి ప్రవర్తించిన తీరు మచ్చుకు కూడా కనబడదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ మంత్రిగా గుర్తింపు పొందిన దుర్గేష్ బాలచంద్రుడు వేషంలో అదరగొట్టేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో దుర్గేష్‌ ప్రదర్శనకు ప్రత్యేక స్థానం దక్కింది.. గత రెండు రోజులుగా ఈయన అద్భుతమైన ప్రదర్శన పైనే చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ వారు సైతం ఆయన ప్రదర్శనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన ప్రదర్శన హల్ చల్ సృష్టిస్తుంది. ఆయన గురించి తెలియని కొందరు అక్కడక్కడా తప్పుడు పోస్టులు పెడుతున్నప్పటికీ అధిక శాతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

నాటి బాలచంద్రుడు ఫోటో వివరాల్లోకెళ్తే వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఏ (ఎకనామిక్స్) చదువుతున్నప్పుడు కాలేజీలో ప్రదర్శించినప్పటది. నాడు, నేడు, ఏనాడూ చెరగని చిరునవ్వు.. ఆత్మీయ పలకరింపు దుర్గేష్ ఆస్తిపాస్తులు

Related posts

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS

కార్తీక పౌర్ణమి – జ్వాలా తోరణ మహత్యం

TNR NEWS

వృక్షో రక్షతి రక్షితః

నాన్నపై కక్ష కట్టిన అక్షరమా!

Dr Suneelkumar Yandra

శీర్షిక : పెళ్లి

Dr Suneelkumar Yandra

విస్తరాకు ….. మనిషి జీవితం

TNR NEWS