Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కాకినాడ కార్పోరేషన్ త్రాగునీటి సరఫరాకు చేరుతున్న గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయి

  • కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థ జలాలను మళ్లించాలి

 

  • ‘ఆరట్లకట్ట – సామర్లకోట’ రిజర్వాయర్ల కలుషిత నివారణకు ఫెన్సింగ్, వాటర్ వర్క్స్ ఆవరణకు రక్షిత ప్రహారీ నిర్మించాలి

 

  • పౌరసంక్షేమ సంఘం

 

కాకినాడ : కాకినాడ నగరంలో సురక్షిత త్రాగునీటి సరఫరాకు రక్షణ కరువయ్యిందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది.  ధవళేశ్వరం నుండి వస్తున్న గోదావరి జలాల పంట కాలువల నుండి ఆరట్లకట్టలోని 100 ఎకరాలు సామర్లకోటలోని 150 ఎకరాల జలశయాలకు సేకరిస్తున్న నీరు కలుషితం అవుతున్నదన్నారు. రావికంపాడు, చిన బ్రహ్మదేవం వద్ద కెమికల్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు మేడపాడు వపరిసరాల వద్ద కలుస్తునందున నియంత్రణ చేయాలన్నారు. ఏటా ఫిబ్రవరిలో జలాశయాల్లో డీ సిల్టింగ్  నిర్వహణ చేయకపోవడం వలన నిల్వల సామర్థ్యం పెరగడం లేదన్నారు. నల్లరేగడి మట్టితో వున్న సాంబమూర్తి జలాశయం పూడికలు తీయిస్తే రెట్టింపు నిల్వలు అధికంగా పొందే వేకుంటుందన్నారు. పైపు లైన్ మార్గాల మలుపుల్లో చేరిన ఇన్ సైడ్ రివెట్ మెంట్ ఎయిర్ వాల్స్ ఆయిలింగ్ చేపడితే పంపింగ్ సరఫరాలో వేగం పెరుగుతుందన్నారు. రిజర్వాయర్స్ లో చేపల పెంపకం పట్టడం అనధికారికంగా జరుగుతున్నదన్నారు. వీటి వ్యర్థాలతో బాటు గా పచ్చిమేత కోసం వచ్చే గేదెలు మేకలు గొర్రెల విసర్జిత వ్యర్థాలు కలుస్తున్నాయన్నారు. ఫెన్సింగ్ లేకపోవడం వలన విహారానికి వచ్చి విచ్చల విడిగా తాగి పడేస్తున్న మద్యం సీసాలు, ప్లాస్టిక్ బాటిల్స్, తిని పడేసే ఆహార కవర్లు తీవ్రంగా చెరువు అడుగుకు చేరుతున్నాయన్నారు.                         లైటింగ్ లేని కారణంగా చెరువు గట్ల మీద వెన్నెల్లో హాయిగా విందులు చేసుకునే అసాంఘిక కృత్యాలు  డ్రగ్స్ ముఠా వ్యక్తులు రాత్రి వేళల్లో ఎక్కువ య్యారన్నారు. ప్రత్యక్ష విధి నిర్వహణ  బాధ్యతా యుత అజమాయిషీ లేకుండా కాంట్రాక్ట్ బేస్ సిబ్బందితో ప్రయివేటు వర్కర్లతో ఫోన్ల అజమాయిషీ నిర్వహణ జరుగుతుండడం వలన అనర్థాలు జరుగుతున్నాయన్నారు. కాకినాడ వాటర్ వర్క్స్ నుండి టెక్నికల్ సిబ్బంది వెళ్ళే వరకు మోటార్లు  పనిచేయని దుస్థితి వుందన్నారు. జలాశయాల గట్ల మీద సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తే కరెంటు కోత వెతలు జనరేటర్ రిపేర్ల అవస్థలుండవన్నారు.  కాకినాడ రామారావు పేట,  నూకాలమ్మ గుడి వీధి నుండి ట్రాన్స్ కో విద్యుత్ స్టేషన్ వరకు వున్న వాటర్ వర్క్స్ రోడ్  పూర్తి రహదారిగా మారడం వలన ఇక్కడి త్రాగునీటి నిల్వల ఓవర్ హెడ్ ట్యాంక్ లకు పూర్తిగా రక్షణ కరువ య్యిందన్నారు. స్మార్ట్ సిటీ కార్యాలయం.. గోదావరి కళాక్షేత్రం.. ఏడాది నుండి నడుస్తున్నా మూడు వారాల క్రిందట అనుమతులు పొందిన హోటల్ నిర్వహణ.. సైన్స్ సెంటర్.. తల్లిపాల ఆరోగ్య కేంద్రం.. వివేకానంద పార్కు మార్గం.. మున్నగు వాటన్నిటికీ వెనుక గేటు మార్గంగా వాటర్ వర్క్స్ ప్రాంగణం కావడం వలన పబ్లిక్ ట్రాఫిక్ మార్గంగా మారడం వలన నలువైపులా ప్రవేశించే దారులతో యధేచ్చగా అందరూ ప్రవేశిస్తున్న కారణంగా సురక్షిత మంచినీటి ప్రదేశానికి సంపూర్ణ రక్షణ పూర్తిగా కరువయ్యిందన్నారు. అసాంఘిక శక్తులు ప్రవేశించి ఓవర్ హెడ్ ట్యాంక్ మెట్లు ఎక్కి ఎటువంటి విషరసాయనాలు పోసినా తీవ్రమైన దుష్పరిణామాలు ఏర్పడే ప్రమాదం పొంచి వుందన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు వద్ద సెక్యూరిటీ వుండరని వాటి పై మూతలు తెరిచివుంటాయని ఇది చాలా ప్రమాదకరమన్నారు. వాటర్ వర్క్స్ ఆవరణలోకి అక్కడ పనిచేసే సిబ్బంది తప్ప ఇతరులెవరూ ప్రవేశించే మార్గం లేకుండా రక్షణ ప్రహారీలు నిర్మించే ప్రణాళిక లేకపోవడం వలన గోదావరి జలాల మార్గం నుండి పంపింగ్ స్టేషన్ ఫిల్టర్ బెడ్ వర్క్స్ యంత్రాంగం వరకు ప్రమాదాలు పొంచి వుండే ప్రదేశాలుగా వున్నాయని జిల్లా ప్రత్యేక అధికారి ముందుగా వీటిపై దృష్టి కేంద్రీకరించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. కమీషనర్, సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్య సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా ఇన్చార్జి, మున్సిపల్ మంత్రి, జిల్లామంత్రి, డిప్యూటీ సిఏం కాకినాడ రక్షిత మంచినీరు రిజర్వాయర్ల పరిరక్షణ కోసం నగర శ్రేయస్సు కాంక్షించి ప్రత్యక్ష పరిశీలన నిర్వహించా లని విజ్ఞప్తి చేసారు. మలి ప్రాతిపదికగా నగరంలోని లీకేజీలపై యాక్షన్ ప్లాన్ చేపడితే రంగు మారిన త్రాగు నీరు సరఫరా అయ్యే అవకాశం ఎంత మాత్రం ఉండదన్నారు. 2025 – 26 కార్పోరేషన్ బడ్జెట్ లో త్రాగునీటి పరిరక్షణ కోసం 50 శాతం నిధులు వెచ్చించాలని డిమాండ్ చేశారు. పండూరు వద్ద 200 ఎకరాల  జలాశయాన్ని ఏర్పాటు చేస్తే శశికాంత్ నగర్ ఫిల్టర్ బెడ్ ప్లాంట్ వద్ద 8 ఫిల్టర్ బెడ్స్ నిర్వహణ నిరంతరం కొనసాగి ప్రజలకు సమృద్ధిగా త్రాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. గోదావరి జలాల రాకకు ధవళేశ్వరం నుండి భూగర్భపైపులైన్ల మార్గాన్ని చేపట్టి వాటర్ వర్క్స్ పైపు లైన్లకు  అనుసంధానం చేస్తే శాశ్వతంగా కొరతలేని గ్రేటర్ స్థాయికి మించిన జల సరఫరా కలుషితం కాని త్రాగు నీటి సంరక్షణ కలుగుతుందన్నారు. ఇందు కోసం 1998లోనే సతీష్ చంద్ర హయాంలో వెయ్యి కోట్ల అంచనాతో ప్రతిపాదన పనులు ప్రపంచ బ్యాంకు సహకారంతో చేసేందుకు కృషి జరిగిందన్నారు. పబ్లిక్ హెల్త్ విభాగంలో మరుగున పడిన ఫైల్ కదిలిస్తే ప్రభుత్వం చేపట్టే వీలుంటుందని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.

Related posts

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

Dr Suneelkumar Yandra

అధ్యాపకుల సమస్యలు పరిష్కరించండి

Dr Suneelkumar Yandra

ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది

Dr Suneelkumar Yandra

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన యువకుడు దర్శకత్వంలో “శివాజ్ఞ”

సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు..

TNR NEWS

కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం