Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పౌరులు చట్టాలకు లోబడి నడుచుకోవాలి

పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాలుకోవా గ్రామం నందు నిర్వహించిన అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ప్రారంభించి మాట్లాడారు. మొదట గ్రామం నుండి కార్యక్రమాన్ని ప్రంభించాను, నేను రైతు కూలి కుటుంభం ను ది వచ్చాను, గ్రామీణ జీవితం, ఇక్కడ ఆప్యాయతలు తెలిసిన వ్యక్తిని అన్నారు. అందరూ కలిసి మెలిసి ఉండాలి. గొడవలు పెట్టుకోవద్దు అన్నారు. పోలీసులు ప్రజల యొక్క భద్రత రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తున్నారు అని పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. గ్రామానికి మంచి పేరు తేవడానికి ప్రతి ఒక్కరూ మంచి నడవడిక కలిగి ఉండాలి అన్నారు. ప్రతి గ్రామం యొక్క చరిత్ర పోలీసు రికార్డ్స్ నందు నమోదు చేయబడి ఉంటుందని, గ్రామం గురించి చెడుగా ఏదైనా సంఘటనలు పోలీస్ స్టేషన్ నందు నవోదయ ఉంటే గ్రామం సమస్యత్మక గ్రామంగా ఉంటుందని, గ్రామం అభివృద్ధి చెందడంలో వెనుక పడుతుందని తెలిపారు. క్షణికావేశంతోనో లేదా విభేదాలతోనూ నేరాలకు పాల్పడిన దాడులు చేసిన, ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన, మహిళల పట్ల దాడులకు పాల్పడిన కేసులు నమోదు చేయబడి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలి కొత్తవారు ఎవరైనా వ్యక్తిగత వివరాలు అడిగితే తెలపవద్దు అన్నారు. రోడ్డు ప్రయాణ సమయంలో వేగంగా వాహనాలు నడపవడ్డు. మహిళలను, పెద్దలను గౌరవించాలి అన్నారు. గ్రామ రక్షణ నేత్రాలుగా CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలను బాగా చదివించాలి, యువత కష్టపడి చేదివి ఉన్నత స్థాయికి ఎదగాలని. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, వ్యవనాల వల్ల భవిష్యత్తు కోల్పోతారు అన్నారు. అలవాటుగా సమస్యలు సృష్టిస్తే, ఇబ్బంది కలిగించే చెడు నడవిడిక కలీగ్8న వారిని మార్చడానికి నిరంతర నిఘా ఉంచుతూ బైండోవర్ చేయడం, షీట్స్ నమోదు చేయడం చేస్తాము. గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలి అన్నారు.

 

గ్రామంలో ఉన్న ఉద్యోగవిరమణ పొందిన ఉపాధ్యాయులు లక్ష్మయ్య, గురవయ్య గార్లలను, గ్రూప్ 2 నందు మంచి ర్యాంక్ సాధించిన లక్ష్మణ్ అనే యువకున్ని ఎస్పి గారు సన్మానించారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి కలకోవా గ్రామం నుండి శ్రీకారం చుట్టిన ఎస్పి గారిని గ్రామస్తులు సన్మానించారు.

 

ఈ కార్యక్రమంలో పోలీసు కళా బృందం వారు సామాజిక అంశాలపై పాటలతో అవగాహన కల్పించారు. సిఐ రామకృష్ణా రెడ్డి, ఎస్సై ప్రవీణ్ కుమార్, గ్రామ పెద్దలు శ్రీరాములు, వెంకటాద్రి, వీరబాబు, నరసింహారావు, వెంకన్న, శ్రీను, శంకర్, మహిళలు, యువత పాల్గొన్నారు.

Related posts

మల్లన్న సన్నిధిలో కార్తీక పున్నమి వేడుకలు

TNR NEWS

నేటి నుండి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

Harish Hs

ముగిసిన గ్రామీణ క్రికెట్ క్రీడోత్సవాలు

Harish Hs

ఎస్బిఐ సేవా కేంద్రంలోనే దర్జాగా పాఠ్యపుస్తకాలు వ్యాపారం

TNR NEWS

కెఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కామర్స్ పోస్టుకు దరఖాస్తులకు ఆహ్వానం

Harish Hs

అగ్రికల్చర్ కళాశాలని కోదాడ నియోజకవర్గంలోని ఏర్పాటు చేయాలి

TNR NEWS