- ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు
పిఠాపురం : స్థానిక రైల్వే స్టేషన్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏపీ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు మరియు పిఠాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, పిఠాపురం రైల్వే స్టేషన్ మాస్టర్ పి.నాగబాబు, బీసీ నాయకులు పొన్నాడ నాగేశ్వరరావు, దాకే అప్పలరాజు, దడాల ప్రవీణ్, వల్లూరి సురేష్, లోడా ఏసుబాబు, దాసబతుల రఘుబాబు ప్రసంగించారు. ఈ సమావేశాన్నిలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాధికారం మాస్టర్ కి చెప్పిన అంబేద్కర్ మార్గంలో మన నడవాలని అన్నారు. ఆయన కల్పించిన రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరు పైన ఉందని అన్నారు. సామాజిక భద్రత వాక్ స్వాతంత్ర్యం కల్పించడం జరిగిందని అన్నారు. రిజర్వేషన్లను తీసేయటంలో భాగంగా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలలోని విభజన తీసుకొచ్చి విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని వాటిపై ప్రతి ఒక్కరు నిత్యం పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృపానందం, సూరిబాబు, రాజు, కన్నారావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.