Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం వాసికి సివిల్స్లో 94వ ర్యాంకు

పిఠాపురం : ఆల్‌ఇండియా సివిల్‌ సర్వీస్‌ రిజల్ట్స్‌ ప్రభుత్వం మంగళవారం వెలువరించింది. ఇందులో పిఠాపురం పట్టణానికి చెందిన చక్కా స్నేహిత్‌ 94వ ర్యాంకు సాధించాడు. చక్కా స్నేహిత్‌ ఆల్‌ఇండియా సివిల్‌ సర్వీస్‌లో 94వ ర్యాంకు సాధించడంపట్ల తండ్రి చక్కా వెంకట్‌ (చిన్నా), తల్లి మాటూరి కోముదిని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 5వ తరగతి వరకు పట్టణంలో ఉన్న ఆదర్ష్‌ హైస్కూల్‌లో చదివి, గుంటూరు భాష్యంలో 10వ తరగతి, ఇంటర్‌ పూర్తి చేశాడు. అనంతరం ఎంసెట్‌లో 31వ ర్యాంకు సాధించాడు. సివిల్స్‌లో ఆల్‌ ఇండియాలో 94వ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు, మిత్రులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్భంగా చక్కా స్నేహిత్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ సర్వీస్‌ చేయాలనే ధృడసంకల్పంతో కష్టపడి ర్యాంకు సాధించానని తెలిపారు. ఇందుకు తనకు పూర్తి సహకారం అందించిన తల్లిదండ్రులు చక్కా వెంకట్‌ (చిన్నా), తల్లి గుంటూరు జిల్లా జడ్జి మాటూరి కోముదినిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం

Dr Suneelkumar Yandra

పాదగయను దర్శించిన జియో సిఈఓ

Dr Suneelkumar Yandra

ప్రజా సేవే పరమావధిగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

Dr Suneelkumar Yandra

పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి

Dr Suneelkumar Yandra

జగన్ కాలనీకి రాకపోకలు ప్రారంభం

Dr Suneelkumar Yandra