Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ పార్టీకి బాలిపల్లి రాంబాబు రాజీనామా

పిఠాపురం : పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయాల కన్వీనర్ల కో-అర్డినేటర్, అర్బన్ సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయం, జిల్లా అధ్యక్షులకు పంపినట్లు ఆయన తెలిపారు. 2019 నుంచి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు సచివాలయాల కన్వీనర్ల్ కో-ఆర్డినేటర్ గా విధులు నిర్వహించి పార్టీ మన్ననలు పొందారు. 2024 ఎన్నికలలోనూ పార్టీ విజయానికి విశేషంగా కృషి చేశారు. పార్టీ ఇన్ ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును తప్పించి మాజీ ఎంపీ వంగా గీతను నియమించడంపై మనస్థాపంతో ఎన్నికల అనంతరం పార్టీకి దూరంగా వున్నారు. ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుత పిఠాపురం నియోజవర్గ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి వంగా గీత వైఖరితో విసిగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఎంత కష్టపడినా గుర్తింపు లేదన్నారు. ఎన్నికల సమయంలోనూ క్షేత్ర స్థాయి కార్యకర్తలు, నాయకులను పక్కన పెట్టారని ఆయన విమర్శించరు. మాజీ ఎమ్మెల్యే దొరబాబు వెంట జనసేనలో చేరనున్నట్లు ఆయన చెప్పారు.

Related posts

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

TNR NEWS

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన పార్టీ జనసేన

Dr Suneelkumar Yandra

👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

డిప్యూటీ సి ఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో సారా జోరు యధాతధంగా వుంది!! – కట్టడి చేయించాలని కోరుతున్న పౌర సంక్షేమ సంఘం

Dr Suneelkumar Yandra

కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:*

TNR NEWS

నూతన పంచాయతీ కార్యదర్శిని సన్మానించిన టిడిపి నాయకుడు మురళి నాయుడు 

TNR NEWS