పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామానికి చెందిన గీసాల చారిటబుల్ సోసైటీ ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో 30 నిరుపేద కుటుంబాలకు కుటుంబానికి వెయ్యి రూపాయలు విలువగల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. సహాయం పొందినవారు మాట్లాడుతూ తమ కుటుంబం ఈ సరుకుల వల్ల ఒక నెల రోజులు తమ కుటుంబ పోషణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సహాయం పొందిన వారు గీసాల చారిటబుల్ సొసైటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా గీసాల చారిటబుల్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి నిరుపేద కుటుంబాలకు సహాయం చేయడమే తమ సొసైటి ముఖ్య ఉద్దేశ్యం అని, పది మందికి సహయం చేయడానికి కృషి చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీసాల చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ జి.సత్యానందం, వైస్ ప్రెసిడెంట్ బి.రామ్మోహనరావు, సెక్రటరి డి.సియోన్, ట్రెజరర్ వి.ఏడుకొండలు, జాయింట్ సెక్రటరి ఎన్.రాజశేఖర్, మెంబర్స్ డి.చంటిబాబు, బి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

previous post