పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని గురువారం మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న 2000-21 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మే 4 వ తేదీన నరసింహులగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 2000-21 పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి సహకరించిన ప్రతి విద్యార్థికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ప్రతి విద్యార్థి విద్యార్థిని కుటుంబ సమేతంగా పాల్గొనాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జె. ఎస్ బాబు, రామాంజి, సైదిరెడ్డి, జితేందర్, హుస్సేన్, రాంబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.