ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడితే చట్టపరమైన చర్యలు తప్పవని, ఉమ్మడి నల్లగొండ జిల్లా జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్, కిరాణా దుకాణాలు,పచ్చళ్ళ షాపులలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినియోగదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాల అమ్మకం దారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బేకరీలు, హోటల్,పలు రకాల దుకాణదారులు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అధికారుల నుండి అనుమతి తీసుకోవాలన్నారు. అలాకాకుండా అపరిశుభ్ర, అనారోగ్యకరమైన తిను బండారాలను, ఆహారాలను విక్రయిస్తే బాధితులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

previous post
next post