సూర్యాపేట : ప్రపంచ మానవాళికి విముక్తిమార్గం చూయించింది కమ్యూనిజం అని రానున్న కాలం కమ్యూనిస్టుల దేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన జిల్లా కేంద్ర కార్యకర్తల సమావేశని కి ముఖ్యఅతిథిగా హాజరై ఆమెమాట్లాడారు.ప్రపంచంలో దోపిడి, పీడన, వివక్షత, అణచివేత ఉన్నంతకాలం కమ్యూనిజం అజెయం గా నిలుస్తుంది అన్నారు. దేశ భవిష్యత్తును మార్చేది సోషలిజమేనని అదే అంతిమ పరిష్కారం ఆమె అన్నారు. పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గర్జించేది కమ్యూనిస్టులేనని అన్నారు. ఇటీవలజరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వంఅనేక హామీలు ఇచ్చి మూడోసారి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇటీవల శ్రీలంక దేశంలో జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టులు దేశ అధ్యక్ష పదవితో పాటు ప్రధానమంత్రి పదవిని సైతం గెలుచుకున్నారన్నారు. గత ఎన్నికల్లో మూడు శాతంగా ఉన్న ఓట్లు ఈసారి జరిగిన ఎన్నికల్లో 47% ఓట్లు కమ్యూనిస్టు పార్టీకి వచ్చాయని అన్నారు. శ్రీలంక స్ఫూర్తితో మనదేశంలో కూడా కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం ఖాయమన్నారు.గత బి ఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ టిఆర్ఎస్ ను ఓడించిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి11 నెలలు నడుస్తున్నఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలలోకేవలం మూడు హామీలు మాత్రమే అమలు చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ తక్షణమే ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలనిడిమాండ్ చేశారు. రుణమాఫీ వెంటనే పూర్తిస్థాయిలో రెండు లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయాలని లేనియెడల ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. వ్యవసాయ కార్మికులకుసంవత్సరానికి120000రూపాయల హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో ప్రభుత్వ భూములు ఉన్నాయని వాటిని భూమిలేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు కావాలని పోరాడుతున్న వారిపై అక్రమ కేసులుపెడుతున్నారనిఆరోపించారు. పేదలకు ఇండ్లు, ఇళ్లస్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు వంటివి ఈ 11 నెలల కాలంలో రేవంత్ ప్రభుత్వం అమలు చేసిన పాపాన పోలేదన్నారు. తక్షణమే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
నవంబర్ 29,30, డిసెంబర్ ఒకటి తేదీలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ తృతీయ మహాసభలు జరుగుతున్నాయని ఈ మహాసభల సందర్భంగా 29వ తేదీన గాంధీ పార్క్ లో జరిగే బహిరంగ సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల సందర్భంగా సాయంత్రం మూడు గంటలకు కు డ కు డ రోడ్డు లో బాలాజీ రైస్ మిల్ దగ్గర నుండి రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ప్రారంభం అవుతుందన్నారు. ఈ మహాసభల విజయవంతానికి జిల్లా ప్రజానీకం హార్దికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి, ఎల్గూరి గోవింద్, వేల్పుల వెంకన్న, జిల్లా పల్లి నరసింహారావు,ధనియాకుల శ్రీకాంత్ వర్మ, వీరబోయిన రవి,బెల్లంకొండ వెంకటేశ్వర్లు,కొప్పుల రజిత, మద్దెల జ్యోతి పులుసు సత్యం, చిన్నపంగా నరసయ్యతదితరులు పాల్గొన్నారు.