కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ గురువారం కోదాడలోని ప్రభుత్వ 30 పడకల దవాఖానాలను పరిశీలించారు. ఓపి రిజిస్టర్ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు, గైనకాలజిస్ట్ పద్మావతి లేకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆసుపత్రిని పరిశీలనకు వచ్చిన ప్రతిసారి గైనకాలజిస్ట్ విధులలో కనిపించడం లేదని ఆసుపత్రి సూపర్డెంట్ Dr దశరథ ను నివేదిక సమర్పించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. ఔషధాల స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు, అన్ని రకాల పేషెంట్లకు మందులు అందుతున్నాయా అడిగి తెలుసుకున్నారు, అనంతరం ప్రసూతి గదిలో సాధారణ ప్రసవాలు ఎన్ని జరిగాయి డ్యూటీ డాక్టర్ను వైష్ణవిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ సాధారణ ప్రసవం అయిన రెడ్ల కుంట గ్రామానికి చెందిన ముత్యాల శిరీష తో కలెక్టర్ మాట్లాడారు, డాక్టర్లు వైద్యం సరిగా నిర్వహిస్తున్నారా, సకాలంలో మందులు అందజేశారా, పుట్టిన బాబుకు వ్యాక్సినేషన్ చేశారా లేదా అని శిరీషను కలెక్టర్ అడిగారు. అక్కడనుండి కొత్తగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ రూమును పరిశీలించారు, కొత్త బ్లాక్ కొరకు జరుగుతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. లేఅవుట్ ను పరిశీలించి వారానికి ఒకసారి జరుగుతున్న పనుల యొక్క నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ వాజిద్ ఆలి, డిసిహెచ్ఎస్ యస్. వెంకటేశ్వర్లు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.