Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోతుల బెడద నుండి ప్రజలను కాపాడాలని మున్సిపల్ కమిషనర్ని కోరిన సిపిఎం పార్టీ నాయకులు కోతుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన సిపిఎం నాయకులు

నారాయణపేట జిల్లా మద్దూర్ మునిసిపాలిటీ పట్టణ కేంద్రంలో కోతులు బీభత్సం సృష్టించాయి. మద్దూరు పట్టణ కేంద్రంలో గత నాలుగు రోజుల నుంచి కోతులు దాడులు చేస్తుండటంతో పలువురు గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. గత ఐదు రోజుల నుంచి దాదాపు ఎనమిది మందికి పైకి వ్యక్తులపై విచక్షణారహితంగా దాడులు చేయగా ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ విషం తెలుసుకున్న సీపీఎం పార్టీ నాయకులు శనివారం రోజు వారిని పరామర్శించారు. తదనంతరం పట్టణ కేంద్రంలో కోతుల సమస్య అధికంగా ఉందని, నాలుగు రోజుల వ్యవధిలోనే ఎనిమిది మంది వ్యక్తులు కోతుల బారిన పడ్డారు అయిన మున్సిపాలిటీ అధికారులు స్పందించడం లేదు ఇపడికైనా వెంటనే స్పందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇచ్చి కోతులను అడవికి తరిమి వేయాలని మునిసిపాలిటీ అధికారులకు వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కార్యదర్శి అశోక్, విజ్ఞాన దర్శిని రాష్ట్ర కార్యదర్శి మొహ్మద్ అలీ మాట్లాడుతూ కోతులు దాడులు చేయడంతో బాధితులు ఒక్కొక్కరు వేల రూపాయలు వైద్యం కోసం ఖర్చుపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. కావున మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి కోతుల సమస్యను నివారించి వారికి సరైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో మేము గాయపడిన వారితో మాట్లాడే క్రమంలో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారన్నీ వెంటనే చర్యలు చేపట్టి కుతుల బెడద నుండి ప్రజలను కాపాడాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు భరత్, మండల నాయకులు వెంకట్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అట్టహాసంగా మునగాల విజ్ఞాన మహోత్సవం

TNR NEWS

నేడు మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహావిష్కరణ

TNR NEWS

TNR NEWS

తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

TNR NEWS

జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి కి ఘన సన్మానం మిత్ర బృందం ఆధ్వర్యంలో వంగవీటి కి ఘన సన్మానం

TNR NEWS

అక్విడేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలి : గడ్డంఅంజి

TNR NEWS