Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ప్రజాపాలన గ్రామ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న.. ఎమ్మెల్యే విజయరమణ రావు..

జూలపల్లి మండలం పడకపూర్ గ్రామంలో, ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామాలల్లో ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజా ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అమలు చేస్తామని తెలిపిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు , గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు మాఫీ , 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశామని అదేవిధంగా రెండవ సంవత్సరం ప్రారంభంలోనే మరో నాలుగు నూతన సంక్షేమ పథకాల అమలుకు కార్యచరణ చేపట్టమని అన్నారు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,ఇందిరమ్మ ఇండ్లు,కొత్త రేషన్ కార్డులు,రైతుభరోసా మార్గదర్శకాలు ప్రకారం వ్యవసాయ భూమిలేని కుటుంబాలను గుర్తించామని వీరికి సంవత్సరానికి 12 వేల రూపాయలను రెండు విడుతలలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని దీనికి సంబంధించిన జాబితా గ్రామాలలో ప్రదర్శిస్తామని ,ఏదైనా అభ్యంతరాలు ఉన్నా , ఇంకా ఎవరైన అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని వాటిని కూడా పరిశీలించి అమలు చేయడం జరుగుతుందని అన్నారు..ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఏఓ,మండల ప్రత్యేక అధికారులు,దులికట్ట సొసైటీ చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్ము పోచలు, ఎలిగేడు మండల అధ్యక్షులు సమా రాజేశ్వర్ రెడ్డి, జూలపల్లి మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్,పుల్ల రావు,పర్శరాములు,వెంకటేశ్వర్ రావు,రవీందర్ రెడ్డి, నర్సింగం,అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు…

Related posts

గజ్వేల్ పట్టణంలో ఫిష్ ఫుడ్ కోర్ట్ ప్రారంభం

TNR NEWS

హామీల అమలు కోసం 10న వికలాంగుల మహాధర్నా ను జయప్రదం చేయండి  సిపిఎం పార్టీజిల్లా సురేష్ గొండ

TNR NEWS

బెల్లం చాయ్ తాగి చూడు బాయ్ –కోదాడలో క్యూ కడుతున్న చాయ్ ప్రియులు.  — ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.  — స్వయం ఉపాధి వైపు ఇరువురి సోదరులు అడుగులు  — బెల్లం టీ స్టాల్ తో లభిస్తున్న ఆదాయం  — నిరుద్యోగ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువకులు….

TNR NEWS

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు…..  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS

రైతు భరోసా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

కోదాడలో విజయ టెక్స్ టైల్స్ ప్రారంభం

Harish Hs