- చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పించిన రాయి కంటి శ్రీనివాస్
కరీంనగర్ : ప్రతిమ మల్టిప్లెక్సీ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు రాయి కంటి శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన చాకలి ఐలమ్మను ప్రతీ ఒక్కరూ స్పరించుకోవాలన్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా తెలంగాణ వీర వనిత అయినా చాకలి ఐలమ్మకి ఘన నివాళులు అర్పిస్తున్నానని, చాకలి ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు ఉధృతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయి కంటి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు.