రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ఎల్బీ శ్రీరామ్ ప్రయాణం సుదీర్ఘమైనదనే చెప్పాలి. అలాంటి ఆయన తాజాగా అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. “ఈ మధ్య కాలంలో కామెడీ వేషాలు తగ్గిపోయాయి .. కమెడియన్స్ కూడా తగ్గిపోయారు. రొటీన్ వేషాలు వేయలేక కొంత గ్యాప్ తీసుకున్నాను అంతే. దర్శకుడిగా .. నటుడిగా షార్ట్స్ ఫిలిమ్స్ మాత్రం చేస్తూనే ఉన్నాను. అది నా సంతృప్తి కోసం” అని అన్నారు. “ఈ మధ్య కుటుంబ కథా చిత్రాలు రావడం లేదని అంటున్నారు. కుటుంబ కథా చిత్రాలు రావడానికి అసలు కుటుంబాలు ఎక్కడున్నాయి? కుటుంబంలో ఉన్న పెద్దవాళ్లను శరణాలయాలలో చేర్పిస్తున్నారు. పిల్లలను హాస్టల్స్ లో వేస్తున్నారు. భార్యాభర్తలలో ఒకరు డే షిఫ్ట్ కి వెళితే, మరొకరు నైట్ షిఫ్ట్ కి వెళుతున్నారు. ఒకరిని ఒకరు చూసుకోవడానికీ .. మాట్లాడుకోవడానికి తీరికలేనంత బిజీ. ఇదంతా దేనికోసమో అర్థం కావడం లేదు” అన్నారు. “ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని సెల్ ఫోన్స్ కాదు, అంతకంటే ఎక్కువ ఉంటున్నాయి. పెద్దవాళ్లు చెప్పే పరిస్థితులలో లేరు .. పిల్లలు వినే స్థితిలో లేరు. పిల్లలను ఫారిన్ పంపించడం కోసమే చదివిస్తున్నట్టుగా చేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన పిల్లలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు .. వాళ్లను పంపించి ఇక్కడ వీళ్లు అవస్థలు పడుతున్నారు. నిజంగా కుటుంబాలు చాలా అస్తవ్యస్థమై పోయాయి” అని అన్నారు.
previous post
