చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతోత్సవం సందర్భంగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ సూర్యాపేట ఆధ్వర్యంలో తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల సహకారంతో కళాశాలలో మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
*ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవేందర్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా సురేందర్ కుమార్ మాట్లాడుతూ, మహిళల విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి రోజును తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడం మహిళా ఉపాధ్యాయులకు గర్వకారణమని తెలిపారు
*ఈ కార్యక్రమ నిర్వాహకులు సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు తల్లమల్ల హసేన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ, సావిత్రిబాయి ఫూలే జయంతిని మహిళా టీచర్స్ డేగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కళాశాలలు, బాలికల హాస్టళ్లకు సావిత్రిబాయి ఫూలే పేరు పెట్టి ఆమెకు తగిన గౌరవం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు*.
సంఘమిత్ర ఎడ్యుకేషనల్ చారిటబుల్ సొసైటీ నుండి మెరిట్ విద్యార్థులకు పుస్తకాలను బహుమతులను అందించారు కళాశాల సీనియర్ అధ్యాపకుల సేవలను గుర్తించి ఘన సన్మానం చేశారు
ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పూర్వ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శశిధర్, సీనియర్ న్యాయవాది పూర్వ చీప్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ వసంత సత్యనారాయణ పిల్లే యాదవ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీవాణి వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత సీనియర్ ఫ్యాకల్టీ దర్శనం ప్రవళిక కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
