Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పహల్గాం లో ఉగ్రదాడి అమానుషం

జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి నిరసనగా కోదాడ పట్టణంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ (ఐవివో) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారిపై కొవ్వొత్తులు వెలిగించి శాంతియుతంగా ర్యాలీ తీసి అమరులైన భారత పౌరుల ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. అనంతరం ఉగ్రవాదం, మతోన్మాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పహల్గాం లో సామాన్య ప్రజలపై ఉగ్రవాదులు జరిపిన దాడి అమానుషం అన్నారు. దేశ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సూర్యపేట జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు, పి ఆర్ ఓ ఎస్ రమేష్, పాట్రన్స్ గుండపునేని నాగేశ్వరరావు, జగనీ ప్రసాద్, సెక్రటరీ ఉపేందర్, ట్రెజరర్ కె వెంకన్న, రహీం, గుండెపంగు రమేష్, హిందువులు, ముస్లిం సోదరులు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు……….

Related posts

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందించాలి…సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి…. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి….. మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

నిరుపేదల అపన్న హస్తం సీఎం సహాయనిది

TNR NEWS

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

Harish Hs

*మద్నూర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష*

TNR NEWS

రామానంద తీర్థ చైర్మన్ ను సన్మానించిన ఓయూ పూర్వ విద్యార్థులు 

TNR NEWS

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది

TNR NEWS