రాయచోటి పట్టణంలో ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి పలు ప్రాంతాలలో తన సిబ్బందితో వాహనాల తనిఖీలను నిర్వహించారు.ఈ తనిఖీలలో వాహన సంబంధిత పత్రాలు లేనివారికి జరిమానా విధించారు.అలాగే తనిఖీలలో ఆచార్యాన్ని కలిగించే విధంగా రోజురోజుకు అధికంగా మైనర్లు పోలీసులకు పట్టుబడుతున్నారని తెలిపారు.ఇలా తనిఖీలలో పట్టుబడిన పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ…అవగాహన లేకుండా మైనర్లు వాహనాలు నడపటం వలన ప్రమాదాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు మైనర్ లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు..