కోదాడ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో ఉన్న మామిడి తోటలో ఆత్మీయ కలయిక( పిక్నిక్) వేడుకలను సంఘ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎక్కడెక్కడో ఉంటున్న విశ్రాంత ఉద్యోగులు అందరూ ఒకే చోట చేరి ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆటపాటలతో సందడిగా గడిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ రామారావు, ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్యలు పాల్గొని మాట్లాడారు. కోదాడ విశ్రాంత ఉద్యోగులు ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా మానసిక సంతోషానికి, సమాజ సేవకు అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. పదవి విరమణ అనంతరం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోదాడలో కార్తీక మాస వనభోజనాలు, సామూహిక జన్మదిన వేడుకలు జరుపుకోవడం పట్ల సంతోషకరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బొల్లు రాంబాబు, రఘు వరప్రసాద్, పొట్ట జగన్మోహన్, విద్యాసాగర్,అమృతా రెడ్డి, భ్రమరాంబ, శోభ,నరసయ్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…….