పెద్దపల్లి మండలం రంగాపూర్, దేవునిపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం రోజున స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రాల్లో రైతులకు రశీదులు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు 48 గంటల్లో ధాన్యం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ 5 రోజుల్లో రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సన్న వడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులెవరు అధైర్యపడవద్దని సన్నవడ్లు సాగు చేసుకున్న ప్రతి ఒక్కరికి బోనస్ అందుతుందని హామీ ఇచ్చారు. రానున్న యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గింజకు మద్దతు ధర చెల్లించి వడ్లను కొనుగోలు చేఇస్తామని చెప్పారు. రైతులకు ఎక్కడ మోసం జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు వడ్ల కటింగ్ పేరిట రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మన్ చింతపండు సంపత్, మాజీ జడ్పీటిసి బండారి రాంమూర్తి, , మాజీ సర్పంచులు, గంట రమేష్, కలబోయిన మహేందర్,,కౌన్సిలర్లు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బొక్కల సంతోష్, అశోక్, నరేందర్, సరయూ, సతీష్,కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.