Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభం 

 

వరంగల్ జిల్లా నర్సంపేట కోర్టులో ఈ-సేవ కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నరసింహ రావు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మహిళా కారాగారాన్ని న్యాయ మూర్తులు సందర్శించి,అక్కడి మహిళా ఖైదీలతో చర్చించారు. ఖైదీల ఆరోగ్య,వ్యక్తిగత పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సలహాలు సూచనల కొరకు న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించాలని తెలిపారు.ఈ-సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ , వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ ,న్యాయమూర్తి కె.చండీశ్వరీ దేవి ,నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుట్టపాక రవి, కార్యదర్శి చిలువేరు కిరణ్ కుమార్, ఏ.జి.పి.లు కె సంజయ్ కుమార్, బి శివ,న్యాయవాదులు కొమ్ము రమేష్ యాదవ్, మోటురి రవి, నారగోని రమేష్, ఠాకూర్ సునీత, బొట్ల పవన్, నాగుల రమేష్, అశోక్, వీరేష్, స్రవంతి,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Related posts

మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ కు ఘన సన్మానం

Harish Hs

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS

తడిసిన ధాన్యం…ఎండలో ఆరబోసిన రైతు 

TNR NEWS

కంపు వాసన నరకయాతన… * డ్రైనేజీ కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు * నడవలేని స్థితిలో వార్డు ప్రజలు * సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

TNR NEWS

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి – పి డి ఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్

TNR NEWS

*మోకుదెబ్బ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పల్నాటి నర్సింహా గౌడ్ ను తొలగింపు* 

TNR NEWS