Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

అనంతగిరి అర్బన్ పార్క్ ను శంకుస్థాపన చేసిన స్పీకర్

వికారాబాద్ మండలం అనంతగిరి అటవీ ప్రాంతంలో అనంతగిరి అర్బన్ ఫారెస్ట్ పార్క్ కు శనివారం శంకుస్థాపన, భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ .

•ముందుగా రూ. 25 లక్షలతో నూతనంగా నిర్మించిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి కార్యాలయాన్ని ప్రారంభించిన స్పీకర్ ప్రసాద్ కుమార్

జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (చార్మినార్ సర్కిల్) ప్రియాంక వర్గీస్, జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, అటవీశాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ

అనంతగిరి అటవీప్రాంతాన్ని అన్ని విధాలుగా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.

ఈ అనంతగిరి భగవంతుని ప్రసాదం అందమైన ప్రదేశం.

అనంతగిరిని రూ. 300 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి రెండు విదేశీ కంపెనీలు ఇచ్చిన ప్రెజెంటేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను చూశాం, త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.

అనంతగిరి పర్యావరణానికి హాని కలగకుండా అన్ని వసతులతో ఈకో టూరిజంగా అభివృద్ధి చేస్తాం.

అనంతగిరిలో అన్ని వసతులతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి కలుగుతుంది.

గత ప్రభుత్వం అనంతగిరి గుట్టపై మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనుకున్నది. కానీ ఇక్కడ పర్యావరణానికి ఇబ్బందులు కలుగుతాయనే ఉద్యేశంతో మెడికల్ కాలేజీని వికారాబాద్ పట్టణ సమీపంలో మెకలా గండి లో నిర్మిస్తున్నాం.

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు.

కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసిన అప్పులు ఇప్పుడు అభివృద్ధికి అడ్డంపడుతున్నాయి.

రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు లొల్లి చేస్తున్నాయి.

అర్హులైన రైతులకు అందరికీ రుణమాఫీ అందుతుంది, రైతులకు నా విజ్ఞప్తి ప్రతిపక్షాల మాయలో పడొద్దు.2004 దేశంలో యూ పీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డెబ్బై వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం బడ్జెట్ లో 31,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇప్పటికే 18,000 కోట్లను రైతు రుణమాఫీ అమలుకు ఖర్చు చేసింది. ఇంకా ఎంత అవసరమైనా ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నది.

Related posts

పుడ ఏర్పాటు కోసం పెద్దపల్లి పట్టణ బంద్ అసంపూర్ణం.

TNR NEWS

పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య…… కోదాడ ముస్లిం మైనార్టీ పాఠశాలకి దోమ తెర డోర్లు,ఐ ఐ టి, నీట్ ప్రవేశ పరీక్షలకొరకు బుక్స్, ఆర్వో వాటర్ ప్లాంట్, డిజిటల్ క్లాస్ ల కొరకు ప్రొజెక్టర్ ఏర్పాటు….. విద్య ద్వారానే సమాజం లో గుర్తింపు…… మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం….. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు…… రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి 

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS

*ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్*

Harish Hs

కోదాడలో ఘనంగా నాభి శిలా బొడ్రాయి ఏడవ వార్షికోత్సవం

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS