తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీలు భారత రాష్ట్ర సమితి, బిజెపి, సిపిఐ నాయకులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం తెల్లవారుజాము నుండే పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకొని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పెద్దపల్లిలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, సిపిఐ నాయకులు తాండ్ర సదానందం,బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు కొయ్యడ సతీష్ గౌడ్, బిజెపి జనరల్ సెక్రెటరీ వేల్పుల రమేష్, బీజేవైఎం పెద్దపల్లి టౌన్ ప్రెసిడెంట్ కుక్క వంశీ, పలువురునీ అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని, సీఎం జిల్లా పర్యటనకు వస్తే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. తాండ్ర సదానందం మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పోత్తున్న సిపిఐ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటు అన్నారు.