కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలానికి చెందిన పలువురు పేదలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన . వారికి
ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(CMRF చెక్కులు) మరియు డబుల్ బెడ్రూం ఇళ్ల చెక్కులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు..
ప్రజా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ లో కొత్త రికార్డు సృష్టించిందని ఎమ్మెల్యే తెలిపారు..
ఏడాదిలోనే 830 కోట్ల రూపాయల సాయం అందించామని, 1.66 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరిందని వివరించారు.13 వేల మందికి 240 కోట్ల విలువ చేసే ఎల్వోసీలు మంజూరు చేశామని తెలిపారు.దళారుల ప్రమేయం లేకుండా ఆన్లైన్ లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు.అనంతరం జుక్కల్ మండలం మిషన్ కల్లాలి గ్రామంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ చౌకధర దుకాణాన్ని ప్రారంభించారు..ఈ కార్యక్రమంలో మండలం నాయకులు పాల్గొన్నారు