మూడు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాతావరణ శాఖ అందించే సమాచారం ప్రకారం మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల వద్ద ధాన్యం ఆరబెట్టుకున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, కొనుగోలు కేంద్రాలలో అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉన్నాయని, ధాన్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ఎక్కడ వాహనాల కోరత ఉండవద్దని కలెక్టర్ అధికారులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.