ఆత్మకూరు మండలంలోని అక్కంపేట మాజీ వైస్ ఎంపీపీ ముద్దం సాంబయ్య ఆధ్వర్యంలో వారి నివాసంలో అయ్యప్ప స్వాములు, స్వామియే శరణం, శరణం అయ్యప్ప శరణు ఘోషతో అయ్యప్ప స్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుంచి వచ్చిన పూజారి, పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఉదయం ప్రారంభమైన పడిపూజ కార్యక్రమాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది.ఆద్యంతం, ఆధ్యాత్మికత ఉట్టి పడేలా, దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలతో ప్రాంగణం మొత్తం శోభయామనంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకమైన మండపం ఏర్పాటుచేసి భక్తిశ్రద్ధలతో, సుందరంగా, రంగురంగుల పువ్వులతో అలంకరించి ముందుగా శ్రీ విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వామి విగ్రహానికి పాలాభిషేకం, నెయ్యాభిషేకం చేసి పదునెట్టాంబడి పై దీపాలు వెలిగించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు, గ్రామ ప్రజలకు, భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.