విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో నీ బాయ్స్ హై స్కూల్ నందు జిల్లా సైన్స్ అధికారి లామ్ దేవరాజు ఆధ్వర్యంలో మండల స్థాయి బయో సైన్సు టాలెంట్ టెస్ట్ ను నిర్వహించి ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చిన్ననాటి నుంచి లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కొరకు నిరంతరం కృషి చేయాలి అన్నారు. టాలెంట్ టెస్టులు విద్యార్థులు పోటీ పరీక్షలు రాయడానికి నైపుణ్య సామర్థ్యాలు పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం విభాగంలో రేఖ శ్రీ ప్రథమ, నరేందర్ ద్వితీయ,తెలుగు మీడియం ప్రథమ నవ్య,సుబ్బలక్ష్మి ద్వితీయ స్థానల్లో నిలిచారు.వీరికి ఈ నెల 18న సూర్యాపేట జిల్లా స్థాయిలో జరిగే బయోసైన్సు టాలెంట్ టెస్ట్ లో పాల్గొంటారని తెలిపారు.ఇ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి, రాజు కె .అశోక్ గౌడ్, హేమలత, రాణి, కొండా వెంకన్న, రాపర్తి రామ నరసయ్య, ధనలక్ష్మి, బిందులత, వీర బ్రహ్మచారి, చిన్నప్ప, ముక్తార్, బడుగుల సైదులు, జానకిరామ్ , ఎస్కే ఖాజా మియా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు…….