కోదాడ మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా షేక్ బాగ్దాద్ నియామకమయ్యారు.మంగళవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెస్ కళాశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన హడక్ కమిటీ అధ్యక్షులు భూలోకరావు, కర్తయ్య ఆధ్వర్యంలో బాగ్దాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు. కబడ్డీ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా బాగ్దాద్ కు నియామక పత్రం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అల్లం ప్రభాకర్ రెడ్డి, పందిరి నాగిరెడ్డి,గంధం పాండు, ఎస్ఎస్ రావు,సైదిబాబు తదితరులు పాల్గొన్నారు….
వీరితోపాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కత్తి సైదులు,వెంకటరత్నం, రఫీ,ప్రధాన కార్యదర్శిగా నామా నరసింహారావు,సంయుక్త కార్యదర్శి కాంపాటి శ్రీనివాసరావు,షేక్ బాజాన్, పంది తిరపయ్య,ట్రెజరర్ సోంపంగు శ్రీను,నాల్లయ్య ఈసీ మెంబర్లుగా షేక్ షఫీ, శ్రీను, జానీ మండల అసోసియేషన్ చైర్మన్ గా షేక్ ముస్తఫా,గౌరవ అధ్యక్షులుగా మహబూబ్ జానీ, ఈదుల కృష్ణయ్య, ఆరుమళ్ళ సీతయ్య లు ఎన్నికయ్యారు……………