Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

 

హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవాన్ని కోదాడ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో సోషల్ యాక్టివిస్ట్ ఫోరం కన్వీనర్ షేక్ మునీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 1927 డిసెంబర్ 19న ఆంగ్లేయులు ఉరి తీసిన భారత స్వాతంత్ర్య సమరయోధులు అమరవీరులు పండిత రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లాఖాన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మాతృభూమిని బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి విముక్తి చేయాలన్న సంకల్పం ఆ ఇరువురి బాటాలను ఏకం చేసిందన్నారు. మత ధర్మాలు వేరువేరు అయినప్పటికీ స్వాతంత్ర సాధనలో వారి స్నేహబంధం ఆనాటికి ఈనాటికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, ఏపూరి రాజు, భాజన్, రాయపూడి వెంకటనారాయణ, శోభన్, ఖాజామీయా, షఫీ, రఫీ, శ్రీకాంత్, జహీర్ తదితరులు పాల్గొన్నారు………

Related posts

నేడు మునగాల లో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలి

TNR NEWS

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం

TNR NEWS

రైతన్నలకు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు విజ్ఞప్తి

TNR NEWS

పుస్తెల తాడు చోరీ కేసులో నిందితులు పట్టివేత

TNR NEWS

వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి

Harish Hs

పెద్దొళ్ల దయాకర్‎ను అభినందించిన ఎంపీ

TNR NEWS