హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని ఆపాలని విద్యార్థుల మీద, సిపిఎం నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ400 ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకుని అమ్మకానికి పెట్టింది. విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిని అమ్మకానికి పెట్టవద్దని, యూనివర్సిటీ అభివృద్ధికే వినియోగించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నాయకత్వంలో గత కొద్ది రోజులుగా విద్యార్థులు పోరాడుతున్నారని అన్నారు. ఉన్నట్టుండి పెద్ద ఎత్తున పోలీసులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తూర్పు క్యాంపస్‌లోకి బుల్డోజర్లతో ప్రవేశించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 400 ఎకరాల స్థలం దాటి తూర్పు క్యాంపస్ స్థలంలో కూడా చదును చేయడం మొదలుపెట్టారని చెప్పారు. ఇది సరైందికాదని ప్రశ్నించిన విద్యార్థులను 60 మందిని అమ్మాయిలతో సహా అరెస్టు చేసి రాత్రి 10 గంటల వరకు మాదాపూర్, రాయ్‌దుర్గ్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లల్లో నిర్బంధించారని ఆరోపించారు. పోలీసుల దాడిలో ఒక విద్యార్థి తల పగిలిందని,అమ్మాయిల బట్టలు చింపారని రక్తాలు కారే విధంగా గీరారని పైగా మరోసారి ఆందోళన చేయబోమని అంగీకరిస్తూ వీడియో వాంగ్మూలం ఇవ్వాలని చెప్పడం అభ్యంతరకరం అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ సిపిఎం మంగళవారం యూనివర్సిటీ గేటు దగ్గర ధర్నాకు పిలుపుగా సిపిఎం నాయకుల ఇండ్ల మీదికి అర్ధరాత్రి వచ్చి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.ప్రజా పోరాటాలను గౌరవిస్తామని ప్రజాస్వామ్య పునరుద్ధరణ తన ఏడవ గ్యారెంటీగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పట్టణ కేంద్రాల్లో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సూర్యాపేట లో చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే. 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించి అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూజికత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నె మ్మాది వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధనియాకుల శ్రీకాంత్, మేకన బోయిన శేఖర్, వీరబోయిన రవి, పులుసు సత్యం, సిపిఎం పార్టీ పట్టణ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్, సిపిఎం పార్టీ టూ టౌన్ కార్యదర్శి పిండిగా నాగమణి, సిపిఎం పార్టీ రూరల్ మండలం కార్యదర్శి మేరెడ్డి కృష్ణారెడ్డి, నాయకులు మేకన బోయిన సైదమ్మ, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, గుండాల పుల్లయ్య, పందిరి సత్యనారాయణరెడ్డి, నారాయణ వీరారెడ్డి, వట్టె ఎర్రయ్య, దోరేపల్లి రఘు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.