Tnrnews.in
తెలంగాణ

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా…… మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి….  ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్……

నల్గొండ, వరంగల్,ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాక్టో మరియు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని సిసిరెడ్డి పాఠశాలలో జరుగుతున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను సందర్శించి ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడారు.ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో ఎన్నో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించానని, ఇక ముందు కూడా వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలైన పెండింగ్ బిల్లుల మంజూరు, మెరుగైన పిఆర్సి, పెండింగ్ లో ఉన్న డిఏలు మంజూరు చేయించడం, ప్రతి సంవత్సరం బదిలీలు ప్రమోషన్లు జరిపించడం, సిపిఎస్ రద్దు కోసం కృషి చేయడం, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం, సమగ్ర శిక్ష ఉద్యోగులకు టైం స్కేల్ ఇప్పించడము, వారి రెగ్యులరైజేషన్ కోసం కృషి చేయడము, ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించడం, 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉద్యోగులందరికీ న్యాయం చేసేలా కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జాక్టో నాయకులు ఓరుగంటి నాగేశ్వరరావు, బంధం వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్, కే శ్రీనివాస నాయుడు, రూఫ్ల నాయక్, బి ఆర్ సి రెడ్డి, భూపతి శ్రీనివాస్, నాగయ్య, యలగొండ శ్రీనివాస్, కిరీటం, ఆదినారాయణ, బూర వెంకటేశ్వర్లు, అత్తి వెంకటేశ్వర్లు, మొదలైన వారు పాల్గొన్నారు…….

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!

TNR NEWS

ఎస్ ఆర్ ఎస్పి స్టేజ్ 2 కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ప్రకటించిన సి ఎం రేవంత్ రెడ్డి

TNR NEWS

రైతు భరోసా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

అదుపుతప్పి ముక్త్యాల బ్రాంచ్ కాలువలో పడిన ఆటో పలువురికి గాయాలు

TNR NEWS

మేం చిన్నోలం కాదు కొట్లాడి తెలంగాణ తెచ్చినోల్లం.. కప్పర ప్రసాద్ రావు టీ జె యూ రాష్ట్ర అధ్యక్షులు.. 

TNR NEWS

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

Harish Hs