రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్తున్న మండల ఏఐఎస్ఎఫ్ నాయకుల్ని స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు, చలో అసెంబ్లీ ముట్టడికి తరలి వెళుతున్న తమను అరెస్టు చేయడం పట్ల స్థానిక ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ ముందు తమ నిరసన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జి శివ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని గురుకులాలలో విష తుల్య ఆహారంతో అనారోగ్యానికి గురవుతున్న వరస ఘటనలపై సమగ్ర విచారణ నిర్వహించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ఇంటిగ్రేటెడ్ గురుకులాల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, మెగా డీఎస్సీ నిర్వహించాలని, వసతి గృహాలకు మరియు గురుకులాలకు మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయాలని, ఎన్నికల హామీలో విద్యార్థులకు రేవంత్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత ల్యాప్ టాపులు స్కూటీలు పంపిణీ చేయాలని డిమాండ్లతో చలో అసెంబ్లీకి తరలి వెళ్తున్న విద్యార్థుల్ని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ముందస్తుగా అరెస్టు చేస్తూ ఉద్యమాన్ని అణిచివేయాలనుకోవడం సరైనది కాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అమరోజు చందు, కే వాసు, శివ, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.