మొక్కుబడిగా సామాజిక తనిఖీ నిర్వహించిన సంఘటన మునగాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే సామాజిక తనిఖీ 15 విడత శనివారం ఎంపీడీవో కార్యాలయం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారుల సమాచారం లోపించడంతో
అధికారులు ఉపాధి హామీ సిబ్బంది సర్వే సిబ్బంది హాజరయ్యారు. సామాజిక తనిఖీపై అధికారుల నుంచి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో సమావేశం హాజరు కాలేదని పలువురు గ్రామస్తులు తెలుపుతున్నారు. మార్చి 2023 నుంచి మార్చి 2024 వరకు నిర్వహించిన పనులపై కులం కుశంగా చర్చలు జరుపుతున్న తరుణంలో సామాజికతనికి ప్రజా వేదికగా మారాల్సిన సమయంలో ప్రజలు రాకపోవడంత జరిగిన పనులు అవకతవకలపై మొక్కుబడిగా సమావేశం నిర్వహించి ముగింపు చేశారు. దీంతో ఉపాధి హామీ సిబ్బంది ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అవకతవకలపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో అధికారుల మధ్య ఉపాధి హామీ సిబ్బంది మధ్య సమావేశం ఏదేమైనాప్పటికీ సమావేశం బహిరంగంగా ప్రజల మధ్యన నిర్వహించాల్సి ఉండగా కప్పి పెడుతూ ఉపాధి హామీ సిబ్బందికి ఉన్నత అధికారుల మద్దతు లభించిందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. మండల ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా అధికారి సమక్షంలో ఈ సమావేశ నిర్వహించడం గమనార్హం. ఈ విషయమై జిల్లా ఉన్నత అధికారులు సమగ్ర నివేదిక అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు