Tnrnews.in
తెలంగాణ

దివ్యాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ…

మునగాల గ్రామానికి చెందిన వాసా శ్రీనివాసరావు కళావతి దంపతుల కుమారుడు వాసా దిలీప్ మండల కేంద్రంలో ప్రజ్ఞా పాఠశాల నందు పాఠశాల స్థాయి విద్యను పూర్తి చేసి ఉన్నత చదువులు అభ్యసించి గత పది సంవత్సరాల క్రితం అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉద్యోగం చేస్తూ తన పుట్టిన గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో, దివ్యాంగుల కోసం 12 ట్రై సైకిళ్లను తన సొంత ఖర్చులతో కొనుగోలు చేసి శనివారం మండల కేంద్రంలోని శివాలయం దేవస్థానం నందు తన కుటుంబ సభ్యుల సమక్షంలో 12 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయడం జరిగింది, అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎన్నారై వాస దిలీప్ మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన ఊరికి ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం మరియు దైవ కార్యక్రమాల కోసం తన సంపాదించిన సంపాదనలో 10% వెచ్చించి ప్రతి సంవత్సరం ఇదే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు, ఈ సందర్భంగా దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వాసా దిలీప్ యశస్విని దంపతులు, మరియు వాస శ్రీనివాసరావు కళావతి దంపతులు, గోవిందరావు పుష్పలత దంపతులతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

TNR NEWS

ఉపాధ్యాయులు.,.. అంకితభావంతో పనిచేయాలి 

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Harish Hs

దాడుల సంస్కృతిని ఖండిస్తున్నాం. _మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్

TNR NEWS

చేర్యాల మున్సిఫ్ కోర్టు 29 ప్రారంభానికి చక చకా ఏర్పాట్లు

TNR NEWS

జలకల తో మురిసిపోతున్న మానేరు నది ఉప్పొంగుతున్న చెక్ డ్యామ్

TNR NEWS