Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

పాడి రైతుల సంక్షేమానికి కృషి……..  రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం……  రైతులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి……  కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి……

పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయంలో సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు పాడి గేదెల కొరకు ఎనిమిది మందికి 25 లక్షల 25వేల రూపాయల రుణాలు చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవసాయ రుణాల తో పాటు పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు తమ సంఘం నుండి అతి తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు ఎకరాల పొలం ఉన్న రైతులకు నాటు కోళ్ల పెంపకం, గొర్రెలు కొనుగోలు చేసేందుకు 50 శాతం సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తున్నామని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధికి తోడ్పడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బుడిగం నరేష్, డైరెక్టర్లు గుండపునేని ప్రభాకర్ రావు, శెట్టి శ్రీనివాసరావు, వట్టే సీతారామయ్య గోబ్రా సీఈఓ మంద వెంకటేశ్వర్లు రైతులు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు…….

Related posts

బిఆర్ఎస్ పార్టీ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

వర్షం నీరు రోడ్డుపై నిల్వకుండ మొరం వేయాలి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

TNR NEWS

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS

BRS పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి విగ్రహానికి పాలాభిషేకం

TNR NEWS

అక్రమ లేఔట్ లను ఎల్.ఆర్.ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయవద్దు…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

TNR NEWS