ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కోదాడ ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండరు, డైరీ ని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, రాష్ట్ర టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి ఆవిష్కరించి ఆయన మాట్లాడారు ఉపాధ్యాయుల సమస్యలు అన్నిటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సుమఖంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల తోనే సమాజ చైతన్యం కలుగుతుందని ఉపాధ్యాయులకు తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా సముచిత స్థానం ఇస్తుందన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సలీం షరీఫ్, ఎస్ టి యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి నాగేశ్వరరావు, బంధం వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, రామిశెట్టి శ్రీనివాసరావు, వెంకటరమణ రూప్లా నాయక్, సత్తూరి బిక్షం, బూర వెంకటేశ్వర్లు, ఓరుగంటి నాగేశ్వరరావు, భాస్కర్ రావు, చందూలాల్ తదితరులు పాల్గొన్నారు……