తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ అధ్యక్షులు గడ్డం చిరంజీవి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కి బోకే అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఉద్యోగులందరూ నూతన ఉత్సాహంతో పనిచేసి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిరంజీవి,కార్యదర్శి చిత్తలూరి పద్మ, కేంద్ర కమిటీ సభ్యులు పోటు వెంకటేశ్వరరావు, విక్రమ్, హుజూర్నగర్ అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు……..