కరీంనగర్
నగరంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్‌లో, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అబ్దుల్ రహమాన్ గారు గంగుల కమలాకర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ, గతంలో సివిల్ సప్లై మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ గారు కరీంనగర్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు ఎంతమంది పేదలకు ఇచ్చారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల గంగుల గారు ప్రెస్ మీట్‌లో “కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డూ ఇవ్వలేదు” అని చేసిన వ్యాఖ్యలను అబ్దుల్ రెహమాన్ ఖండించారు. ఆయన వివరించగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలలలోనే జిల్లాలో 18,060 అప్లికేషన్లు వచ్చాయిగా, అందులో 11,624 కొత్త తెల్ల రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రమే 7,413 అప్లికేషన్లలో 4,265 కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సివిల్ సప్లై ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిలో శ్రీధర్ బాబు, మానకొండూరు ఎమ్మెల్యే కమ్మపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ల సహకారంతో సాధ్యమైందని పేర్కొన్నారు.
“మీరు గత పదేళ్లలో ఎంత పనిచేశారో చెప్పండి. బహిరంగంగా శ్వేతపత్రం విడుదల చేయండి” అని గంగుల కమలాకర్‌కు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహమ్మద్ అమీర్, సిరిపురం మనోజ్, కాంగ్రెస్ సెక్రటరీ సద్దాం, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కలీం పాల్గొన్నారు.