మునగాల మండల కేంద్రంలోని రామలింగేశ్వర దేవాలయానికి మునగాల గ్రామ మాజీ సర్పంచ్ దేవరం వెంకటరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తె -అల్లుడు గజ్జెల అనూష-సంతోష్ రెడ్డి స్వామి వారి ఊరేగింపుకు రథం చేపించుటకు లక్ష రూపాయలు అందించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షులు తూముల .వీరస్వామి మాట్లాడుతూ దేవస్థాన అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం అన్నారు . ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యదర్శి గంధం. అంజయ్య, కుటుంబ సభ్యులు దేవరం. ఆండాలమ్మ ,పద్మ రామిరెడ్డి సునీత తదితరులు పాల్గొన్నారు.