February 4, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సావిత్రీబాయి ఫూలే సేవలు మరువలేనివి

భారత దేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సావిత్రిబాయి ఫూలే సేవలు మరువలేనివని తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ అన్నారు.ఎమ్మార్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సావిత్రి బాయి ఫూలే ఆమె 194వ జయంతిని ఘనంగా నిర్వహించారు.సావిత్రీబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం తడ్కల్ క్లస్టర్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ మాట్లాడుతు….సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని,రచయిత్రి,ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది,కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా,శూద్రుల, అస్పృశ్యుల,మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు.నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది.సమాజంలోని కులతత్వం,పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్రమే తెలుసు.కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు,పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని అన్నారు,ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, మాణిక్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

Related posts

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS

కోదాడలో గ్యాడ్జెట్ జోన్ ప్రారంభం

Harish Hs

నిరుపేదల అపన్న హస్తం సీఎం సహాయనిది

TNR NEWS

సావిత్రి బాయి పూలే నేషనల్ ఐకాన్ అవార్డు అందుకున్న మల్యాల సతీష్ కుమార్ హైదరబాద్ రవీంద్ర భారతిలో అవార్డు ప్రధానం చేసిన అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్

TNR NEWS

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS

భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి వేడుకలను ఊరురా ఘనంగా నిర్వహించాలి.

Harish Hs