Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన మున్సిపల్ కౌన్సిలర్లకు నాయకులకు ప్రతి ఒక్కరి ఒక్కరికి ధన్యవాదాలు.  మీడియా మిత్రులకు ధన్యవాదాలు.  మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్స్ వికారాబాద్ మున్సిపల్ ప్రజలందరికీ ధన్యవాదాలు. గత బిఆర్ఎస్ పాలనాలో నాకు మున్సిపల్ చైర్మన్ పదవి రావడం ఎంతో సంతోషకరం. రెండున్నర సంవత్సరాల తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుచ్చి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. నాడు రాజకీయాలు తప్ప అభివృద్ధికి సహకరించలేదు. ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో తెలంగాణ శాసన సభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి రూ.80 కోట్లు మంజూరు అయ్యాయి అందుకు గౌరవ స్పీకర్ మరియు వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు అని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు. నేటితో ఐదేళ్ల తన చైర్ పర్సన్ పదవి కాలం విజయవంతంగా పూర్తవుతున్న సందర్భంగా చైర్ పర్సన్ గారు మున్సిపల్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ… వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న ఐదేళ్ల పాటు నాకు సహకరించి.. వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి సహకరించిన జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లకు, కో ఆప్షన్ సభ్యులకు, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా వికారాబాద్ పట్టణ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు తీసుకున్న నెల రోజుల వ్యవధిలోనే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని భయపెట్టింది. అలాంటి సమయంలో అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. చాలామంది పేదలకు తినడానికి తిండి లేక, బయటకు రాలేక అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలో ప్రాణాలకు తెగించి చైర్ పర్సన్ గా నా బాధ్యతను నిర్వర్తించడం కోసం రెడ్ జోన్లకు సైతం వెళ్లి వారికి సహాయాన్ని అందించడం జరిగింది. ఆ క్షణాలు నా జీవితంలో మరువలేనివి. చేసిన సహాయానికి గుర్తుగా పట్టణ ప్రజలు అందరూ నన్ను అక్కున చేర్చుకొని, నేను ఎక్కడ కనిపించినా మా మున్సిపల్ చైర్ పర్సన్ అంటూ ఆప్యాయంగా పలకరించారు. అభివృద్ధితో పాటు వికారాబాద్ మున్సిపల్ ప్రజల నుండి ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

ముఖ్యంగా గత బిఆర్ఎస్ పాలనలో కొందరు నాయకులు తమ స్వార్థం కోసం రాజకీయాలు చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారు. చైర్ పర్సన్ గా ప్రజలకు సేవ చేయాలని ఎంతో ఆశతో వచ్చిన నన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారు. అట్టి సమస్యలను అధిగమించడానికి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సహకారం చాలా ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ప్రసాద్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం తన మాట నిలబెట్టుకొని ఏడాది కాలంలోనే వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధి కోసం రూ.80 కోట్ల నిధులు మంజూరు చేయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతోనే రూ.119 కోట్లు నిధులతో వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి నాకు పూర్తి సహకారం అందించిన మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts

పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక…. జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభలో, ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి…… అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు….. వేపాలసింగారం ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

*57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి*.. *ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

భవన నిర్మాణ వ్యర్ధాలతో ప్రజలకు ఇబ్బందులు….

TNR NEWS

ఎస్సైగా ప్రమోషన్ పొందిన సైదయ్యకు ఘన సన్మానం

Harish Hs

యలక రత్తమ్మ మృతికి నివాళులర్పించిన జర్నలిస్టులు సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యలక రా మిరెడ్డి తల్లిగారు, టిఆర్ఎస్ నాయకులు

TNR NEWS